నిండు ఆరోగ్యంతో సంపూర్ణ జీవితం
20-05-2024 02:15 AM
మహబూబ్‌నగర్, మే 19 (విజయక్రాంతి) : నిండు ఆరోగ్యంతో సంపూర్ణ జీవితం తమ సొంతమవుతంపదని ఆయుర్వేదిక్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకురాలు డాక్టర్ లావణ్య తెలిపారు. మూసాపేటలో ముక్తదిర్ బాబాకు ఆయుర్వేదిక్ మందులు అందజేసి, ఆయుర్వేదిక్ మెడిసిన్ ప్రాముఖ్యతను వివరించారు. 5 నెలలుగా పక్షవాతంతో బాధపడుతున్న ముక్తదిర్‌బాబాకు మందులు అందజేశామని, ఆర్థిక స్తోమ త లేని అనారోగ్య బాధితులకు తమ ట్రస్ట్ అండగా ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీ టీసీ రామన్‌గౌడ్, మాజీ ఎంపీటీసీ శెట్టి శేఖర్, ఎంపీటీసీ గోవర్ధన్, ప్రతాప్‌రెడ్డి, మహేందర్, తిరుపతయ్యగౌడ్, నారాయణ, అగ్రికల్చర్ అధికారి శ్రీనివా సులు తదితరులు ఉన్నారు.






