calender_icon.png 4 December, 2025 | 2:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం

04-12-2025 12:00:00 AM

ముకరంపుర, డిసెంబరు 3 (విజయ క్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందూ దేవతలపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బిజెపి జిల్లా శాఖ ఆధ్వర్యంలో బుధవారం తెలంగాణ చౌక్ లో సీఎం దిష్టిబొమ్మ దహనం చేశారు.  సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయాలే పరమావధిగా జీవిస్తున్నారని , తన రాజకీయ అవసరాల కోసం ఇతర మతాల మెప్పుకోసం హిందూ దేవుళ్లను ద్వేషిస్తూ, హేళనగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి బేషరతుగా హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిల రమేష్, వాసాల రమేష్, కళ్లెం వాసుదేవరెడ్డి, గువ్వల శ్రీనివాస్, కటకంలోకేష్, జోన్ ప్రెసిడెంట్ పాదం శివరాజ్, బండారు గాయత్రి, తణుకు సాయి కృష్ణ, అవదుర్తి శ్రీనివాస్ నరహరి లక్ష్మారెడ్డి, ఆవిడల చైతన్య, నాంపల్లి శ్రీనివాస్, ప్రసన్న, యువ క్రాంతి, అక్షయ్, కట్ట రాజు, ప్రసాద్, బోయిన్ శ్రీను, జి రవి, అనిష్, పాశం తిరుపతి, ఆకుల నరేష్, అజయ్, వెంకటేష్, సందీప్, శ్రీధర్,అనిల్,విజయ్, కలికోట మోహన్,నారాయణ, జిత్తు, నవీన్, తదితరులుపాల్గొన్నారు