04-12-2025 12:00:00 AM
కరీంనగర్, డిసెంబరు 3 (విజయ క్రాంతి): కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ సోదరుడు పొన్నం శ్రీకాంత్ గౌడ్ సోమవారం రోడ్డు ప్రమాదంలో మరణించారు. మంగళవారం మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నగరంలోని రేకుర్తిలో గల పొన్నం అనిల్ కుమార్ ఇంటికి వెళ్లి శ్రీకాంత్ చిత్రపటం వద్ద పూలు వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు.
ఆయన వెంట జిల్లా బిఆర్‌ఎస్ అధ్యక్షులు జి వి రామకృష్ణ రావు, నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, మాజీ కార్పొరేటర్లు సుధగోని మాధవి - కృష్ణ గౌడ్, గుగ్గిళ్ల శ్రీనివాస్, నాయకులు కర్ర సూర్య శేఖర్, నేతి రవివర్మ, బిఆర్‌ఎస్ వి నాయకులు చుక్క శ్రీనివాస్, ఓడ్నాల రాజు, మిడిదొడ్డి నవీన్, నందేల్లి సన్నీ, ప్రణయ్ గౌడ్, తదితరులు ఉన్నారు. అలాగే మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ తుల ఉమ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ కుటుంబ సభ్యులనుపరామర్శించారు.