30 August, 2026 | 9:42 AM

కాలిపోయిన ట్రాన్స్ ఫార్మర్

30-08-2026 08:40 AM

ఐదు మండలాలకు నిలిచిన మిషన్ భగీరథ పంపింగ్

ఇబ్బందులు పడుతున్న ప్రజలు 

భూపాలపల్లి/గణపురం,(విజయక్రాంతి): మండలంలోని గాంధీనగర్ సమీపంలో ఏర్పాటుచేసిన మిషన్ భగీరథ పంపు హౌస్  నుండి 5 మండలాలకు నీటి సరఫరా నిలిచిపోయింది. పంపు హౌస్ సమీపంలో ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్ నుండి భారీగా మంటలు వ్యాపించి శుక్రవారం  కాలిపోయింది. దీంతో గణపురం, రేగొండ చిట్యాల, టేకుమట్ల, మొగుళ్ళపల్లి, మండలాలకు నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటులో అధికారులు నిర్లక్ష్యం వహించడంతో ఐదు మండలాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి త్వరితగతిన ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.