30 August, 2026 | 9:53 AM

వాహన తనిఖీల్లో 4 కిలోల గంజాయి స్వాధీనం

30-08-2026 08:45 AM

బోధన్, ఆగస్టు 30:  (విజయక్రాంతి): బోధన్ పట్టణానికి గంజాయి తరలిస్తున్న వ్యక్తిని బోధన్ రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకుని, అతని వద్ద నుంచి సుమారు 4 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఓ వ్యక్తి టీవీఎస్‌ ఎక్స్ఎల్‌ వాహనంపై గంజాయిని బోధన్ పట్టణానికి సరఫరా చేసేందుకు తీసుకువస్తున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో బోధన్ రూరల్ సీఐ విజయ్‌బాబు ఆదేశాల మేరకు ఎస్‌ఐ రాజశేఖర్ సిబ్బందితో కలిసి చెక్‌పోస్ట్ వద్ద నిఘా ఏర్పాటు చేసి వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ధర్మాబాద్ తాలూకాకు చెందిన లక్ష్మణ్ గంగగిరి (65) అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని తనిఖీ చేశారు. అతని వద్ద సుమారు 4 కిలోల గంజాయి లభించడంతో స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై చట్ట ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.