30 August, 2026 | 9:43 AM

పెద్దమ్మ తల్లి ఆలయ భూమిపూజకు నేతలకు ఆహ్వానం

30-08-2026 08:39 AM

గణపురం,(విజయక్రాంతి): మండలంలోని ధర్మారావుపేటలో ముదిరాజ్‌ల ఆరాధ్య దైవమైన శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి సోమవారం నిర్వహించనున్న భూమిపూజ కార్యక్రమానికి పలువురు ప్రముఖ నేతలను ఆలయ కమిటీ అధ్యక్షులు ఆకుల సుభాష్ ముదిరాజ్ ఆహ్వానించారు. శాసన మండలి ఉప సభాపతి, ఎమ్మెల్సీ బండా ప్రకాష్ ముదిరాజ్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చందుపట్ల కీర్తిరెడ్డి, సత్యపాల్ రెడ్డి, ముదిరాజ్ ఎంప్లాయీస్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ కొత్తగట్టు శ్రీనివాస్ ముదిరాజ్, మేపా రాష్ట్ర అధ్యక్షులు పులి దేవేందర్ ముదిరాజ్, ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ రావుల జగదీశ్వర ప్రసాద్ ముదిరాజ్, తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లెబోయిన అశోక్ ముదిరాజ్, ములుగు జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షులు ఎర్ల వెంకన్న ముదిరాజ్, మేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిరటి రాజు ముదిరాజ్ తదితరులను భూమిపూజ కార్యక్రమానికి ఆహ్వానించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ఉపాధ్యక్షులు సాదు కరుణాకర్, సహాయ కార్యదర్శి ఆకుల రాజకుమార్, మాజీ ఉపసర్పంచ్ ఊరడి రాజయ్య, కమిటీ సభ్యులు ఆకుల రాకేష్ తదితరులు పాల్గొన్నారు.