30 August, 2026 | 9:55 AM

బీజేపీ బోధన్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్‌గా కొలిపాక రేణుక బాలరాజు

30-08-2026 08:47 AM

బోధన్, ఆగస్టు 30 (విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ (బీజేపీ) బోధన్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్‌గా కొలిపాక రేణుక బాలరాజును నియమించారు. ఈ మేరకు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు శనివారం (ఆగస్టు 29, 2026) ప్రకటన విడుదల చేశారు. అదేవిధంగా డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా రాజులదేవీ లక్ష్మీ పూజితను, ఫ్లోర్ సెక్రటరీగా గుంత అబ్బవ్వను నియమించినట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా బోధన్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్‌గా నియమితులైన కొలిపాక రేణుక బాలరాజు మాట్లాడుతూ... తనపై నమ్మకంతో ఫ్లోర్ లీడర్ బాధ్యతలు అప్పగించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఎంపీ ధర్మపురి అరవింద్, జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి, బోధన్ నియోజకవర్గ నాయకులు మేడపాటి ప్రకాశ్ రెడ్డి, వడ్డీ మోహన్ రెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ బోధన్ మున్సిపాలిటీలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని రేణుక బాలరాజు పేర్కొన్నారు.