calender_icon.png 21 August, 2025 | 1:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లోయలోకి దూసుకెళ్లిన యాత్రికుల బస్సు.. ఒకరు మృతి

21-08-2025 11:48:21 AM

సాంబా: మాతా వైష్ణో దేవి గుహ మందిరానికి యాత్రికులను తీసుకెళ్తున్న బస్సు జమ్మూ-పఠాన్‌కోట్ హైవే (Jammu-Pathankot Highway)నుంచి అదుపుతప్పి లోయలో పడిపోయిన ఘటనలో ఒకరు మృతి చెందగా, 40 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఉత్తరప్రదేశ్ కథువా నుండి కాత్రాకు వెళ్తున్న ప్రయాణీకుల బస్సు టైరు పగిలిపోవడంతో నియంత్రణ కోల్పోయి వంతెన నుండి 30 అడుగుల తోతులో పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు పేర్కొన్నారు. మృతుడిని అమ్రోహాకు చెందిన 45 ఏళ్ల ఇక్బాల్ సింగ్‌గా గుర్తించారు. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని సాంబాలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో ఎయిమ్స్ విజయ్‌పూర్‌లో చేర్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.