calender_icon.png 21 August, 2025 | 1:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐఐఐటీ క్యాంపస్‌లో పీయూసీ విద్యార్థి ఆత్మహత్య

21-08-2025 11:34:01 AM

అమరావతి: శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం ఫరీద్‌పేటకు చెందిన నరసింహనాయుడు అనే ద్వితీయ సంవత్సరం పీయూసీ విద్యార్థి కడప జిల్లా వేంపల్లి మండలం ఐఐఐటీ ఇడుపులపాయ ఆవరణలోని ఐఐఐటీ ఒంగోలు క్యాంపస్‌లో(IIIT Ongole Campus) గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. క్యాంపస్‌ సిబ్బంది సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని స్థానిక ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.