26-05-2025 10:16:52 PM
సిరిసిల్ల నుండి కాళేశ్వరం వచ్చిన ప్రైవేట్ బస్సు..
సురక్షితంగా బయటపడ్డ భక్తులు..
మంథని (విజయక్రాంతి): కాళేశ్వరం(Kaleshwaram) అన్నారం సమీపంలోని ప్రధాన రహదారిపై మద్దెల పెళ్లి వద్ద ప్రమాదవశాత్తు భక్తులతో ప్రయాణిస్తున్న బస్సు సోమవారం దగ్ధమైంది. అదృష్టవశాత్తు బస్సులో ఉన్న ప్రయాణికులు భక్తులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు, దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రం నుండి కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు వచ్చిన ప్రైవేట్ బస్సులో ప్రమాదవశాస్తు షార్ట్ సర్క్యూట్ కావడంతో మెల్లగా మంటలు కనిపించాయి. గమనించిన డ్రైవర్, భక్తులు వెంటనే బస్సును పక్కకు నిలిపివేసి ప్రయాణికులను దించారు. ఆ తర్వాత బస్సులో మెల్లగా మెల్లగా మంటలు వ్యాప్తి చెందాయి. దీంతో బస్సు పూర్తిగా దగ్ధం అయిందని భక్తులు తెలిపారు. బస్సులోని ప్రయాణికులు, భక్తులు సేఫ్ గా ఉండడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఆ కాళేశ్వరుడు ముక్తేశ్వరుడు దయతోటే ఎలాంటి హాని జరగలేదని భక్తులు తెలిపారు.