27-05-2025 12:00:00 AM
ఐఎన్‌టీయూసీ(ఆర్) జాతీయ అధ్యక్షుడు అంబటి కృష్ణమూర్తి
ముషీరాబాద్, మే 26 (విజయక్రాంతి) : అసలైన ఐఎన్‌టీయూసీ మాదే అని ఐఎన్‌టీయూసీ(ఆర్) జాతీయ అధ్యక్షుడు అంబటి కృష్ణ మూర్తి ప్రకటించారు. ఈ మేరకు సోమవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఐఎన్‌టీయూసీ(ఆర్) రాష్ట్ర అధ్యక్షులు గుంజ శ్రీనివాస్ అధ్యక్షతన ఐఎన్‌టీయూసీ(ఆర్) తెలంగాణ రాష్ట్ర మహాసభలలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు.
కార్మికవర్గ ప్రయోజనాలను విస్మరిస్తూ భౌతిక దాడులు చేస్తూ యూనియన్ పై పెత్తనం చేసేందుకు ఎవరు ప్రయత్నం చేసినా సహించేదిలేదన్నారు. ఐఎన్‌టీయూసీ (ఆర్)లో పనిచేస్తున్న నాయకులపైన ఇప్పటివరకు అవినీతి ఆరోపణలు లేదని, కార్మికుల హక్కులు, ప్రయోజనాల పరిరక్షణ కోసం నిరంతరం పోరాటాలు చేస్తూ ఐఎన్‌టీయూసీ(ఆర్)ని బలమైన శక్తిగా తయారు చేస్తాం అని పేర్కొన్నారు.
ఐఎన్‌టీయూసీ(ఆర్) నేతలపై భౌతిక దాడులకు పాల్పడడమే కాకుం డా ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని విమర్శించిన కనీస వేతనాల కమిటీ చైర్మన్ జనక్ ప్రసాద్ ముఠాకు తగిన బుద్ది చెబుతామని హెచ్చరించారు.
ఈ మహాసభలో ఐఎన్‌టీయూసీ(ఆర్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గూడ అయిలయ్య, జాతీయ కార్యదర్శి బి.అమర్ బాబు, జాతీయ ఉపాధ్యక్షుడు సత్యదేవ్, మ నోజ్ భట్, తెలంగాణ రాష్ట్ర వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల లక్ష్మణ్, ప్రముఖ ట్రేడ్ యూనియన్ నాయకులు గొల్లపల్లి దయానంద్, రాష్ట్ర నాయకులు నడిమిటి నాగరాజు, చాంద్ పాషా, క్రిష్ణగౌడ్, ఆనంద్, జ్యోతి, జేమ్స్ తదితరులు ప్రసంగించారు.