27-05-2025 12:00:00 AM
ముషీరాబాద్, మే 26 (విజయక్రాంతి): ఈ నెల 21న మావోయిస్టులపై జరిగిన ’దాడి’ ముమ్మాటికీ బూటకపు ఎన్ కౌంటరేనని, 27 మంది మావోయిస్టుల్ని పట్టుకొచ్చి కాల్చివేశారనేది నగ్న సత్యమని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ప్రధాన కార్యదర్శి చంద్రన్న సోమవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. ఇప్పటికైనా శవాలను మార్చూ రీలో భద్రపరిచి బాధిత కుటుంబాలకు అప్పగించాలని డిమాండ్ చేశారు.
ఈనెల 21న మరణించిన ఆరు శవాలను కూడా కుటుంబాలకు అప్పగించే బాధ్యత తెలంగాణ, ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వాలదేనని సీపీఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ డిమాండ్ చేస్తుందన్నారు. గత ఐదు రోజులుగా ఈ బూటకపు ఎన్ కౌంటర్లలో మరణించిన శవాలను గమనించిన వారి మిత్రులు, గతంలో వారితో పనిచేసిన కామ్రేడ్స్ ఇవి బూటకపు ఎన్‌కౌంటర్లని ప్రకటిస్తున్నారని పేర్కొన్నారు.
మరోవైపు కేంద్ర ప్రభుత్వం, ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వం ఈ శవాలను చూడటానికి వచ్చిన వారి కుటుంబ సభ్యులను బెదిరిస్తున్నారని అన్నారు. అదే విధంగా ఆంధ్ర, తెలంగాణకు సంబంధించిన కామ్రేడ్ నంబాల కేశవరావు, జంగు నవీన్, సంగీత, భూమిక, యుగేందర్, రాజేష్ శవాలను ఈ రాష్ట్రాలకు తెప్పించి వారి కుటుంబాలకు అప్పగించే బాధ్యత ఆంధ్ర, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంతర్రెడ్డిలదేనని అన్నారు.
ఈ ఎన్‌కౌంటర్‌తో సహా మధ్య భారత్ లో కగార్ పేరిట జరిగిన అన్ని ఎన్ కౌంటర్లపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేత న్యాయవిచారణ జరిపించాలని సీపీఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ డి మాండ్ చేస్తున్నదన్నారు.
అంతే కాకుండా దే శవ్యాప్తంగా వున్న అటవీ ప్రాంతాలను స్వ దేశీ, విదేశీ కార్పోరేట్లకు కట్టబెట్టడాన్ని ము ఖ్యంగా మధ్యభారత్, ఈశాన్య ప్రాంత రాష్ట్రాలలోనూ, మణిపూర్ లోని అడవులను, ఖని జాలను, సహజ వనరులను అప్ప గిం చడానికి చేసే ప్రయత్నాలకు స్వస్తి పలకాలని సీపీఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ కేంద్ర కమి టీ మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నదని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.