21 April, 2026 | 1:24 AM

మాతుసంగెం గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలి

21-04-2026 12:09 AM

గ్రామ సర్పంచ్ మాదోజి వందన బల్వంత్ రావ్

గాంధారి, ఏప్రిల్ 20 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా గాంధారి మండలం మాతుసంగెం గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలి అని కామారెడ్డి ఆర్టీసీ డిపో మేనేజర్‌ను కలిసి వినతి పత్రం అందచేసినట్టు గ్రామ సర్పంచ్ మాదోజి వందన బల్వంత్ రావ్ తెలిపారు. గ్రామానికి ఉదయం,మధ్యాహ్నం, సాయంత్రం మూడు ట్రిప్పుల బస్సు సౌకర్యం కల్పించాలి ఆమె అన్నారు.

బస్సు సౌకర్యం లేకపోవడంతో స్కూల్, కాలేజ్ విద్యార్థులకు చాలా ఇబ్బందికరంగా ఉందని ఆమె అన్నారు. గ్రామప్రజలు తమ పనుల నిమిత్తం మండల కేంద్రమైన గాంధారికి రావాలంటే ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ బుచ్చి స్వామి, వార్డు సభ్యులు నీరడి బాలరాజు, చిర్ర సంతోష్, మాజీ సర్పంచ్ మహమ్మద్ ఖాసీం,  పట్లోల్ల ప్రశాంత్, చెన్న జ్ఞానేశ్వర్ పాల్గొన్నారు.