13-10-2025 08:37:01 AM
మరిపెడ,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) డోర్నకల్ రోడ్డుపై గుంతను తప్పించబోయి బస్సు బోల్తా పడిన ఘటన మరిపెడ మండలం మున్సిపాలిటీ కేంద్రం నందు జాతీయ రహదారి పై ఆదివారం రాత్రి హైదరాబాద్ నుండి కురవి మండల పుణ్యక్షేత్రం అయినటువంటి వీరభద్ర స్వామికి ముక్కులు చెల్లించుకోవడం కోసం 25 మందితో ప్రయాణిస్తున్న బస్సు జాతీయ రహదారిపై ఏర్పడ్డ గుంతను తప్పియబోయి అదుపుతప్పి బోల్తా పడింది.ఈ ప్రమాదంలో ప్రయాణికులకు గాయాలు కాగా స్థానిక గవర్నమెంట్ హాస్పటల్ కు తరలించడం జరిగింది.