13-10-2025 09:54:13 AM
హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి(Konda Lakshma Reddy Passed Away) సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో(Apollo Hospital) వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన వయసు 84 సంవత్సరాలు. జర్నలిజం పట్ల మక్కువతో లక్ష్మారెడ్డి 1980లో స్థానిక వార్తా సంస్థ ఎన్ఎస్ఎస్(NSS)ను ప్రారంభించారు.
జూబ్లీ హిల్స్ జర్నలిస్ట్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ(Jubilee Hills Journalist Co-operative Housing Society), ప్రెస్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఆయన అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి కొండా వెంకట రంగారెడ్డి మనవడు. ఆయన తన రాజకీయ జీవితంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (Andhra Pradesh Congress Committee) ప్రతినిధి, గ్రీవెన్స్ సెల్ ఛైర్మన్‌తో సహా వివిధ పదవులను నిర్వహించారు. లక్ష్మారెడ్డి ఆంధ్రప్రదేశ్ క్రీడా మండలి ఛైర్మన్‌గా కూడా పనిచేశారు. 1999, 2014 లోక్‌సభ ఎన్నికల్లో హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. కానీ ఈ రెండు ఎన్నికల్లోనూ ఓటమి పాలయ్యారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.