calender_icon.png 13 October, 2025 | 1:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కారును ఢీకొన్న బైక్.. ఒకరు స్పాట్ డెడ్

13-10-2025 10:46:57 AM

హైదరాబాద్: సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో(Suraram Police Station) ఆదివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో(Road Accident) ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సాయిబాబా నగర్ ఎక్స్ రోడ్డు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. అధిక వేగంతో వెళ్తున్న కేటీఎమ్ బైక్ అదుపుతప్పి కారును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో సాయి కుమార్ (38) అనే రైడర్ తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. 

బైక్ పై ప్రయాణిస్తున్న మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే చికిత్స కోసం మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు. బైక్ నిర్లక్ష్యంగా నడపడంతోనే నియంత్రణ కోల్పోయి కారును ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు. ఆ ప్రాంతంలో ట్రాఫిక్ రద్దీని తొలగించడానికి దెబ్బతిన్న బైక్, కారును రోడ్డుపై నుండి పోలీసులు తొలగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న సూరారం పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.