13-10-2025 10:49:55 AM
బహుజన వేదిక రాష్ట్ర కన్వీనర్ కస్తూరి రాములు
చిలుకూరు: స్థానిక సంస్థల ఎన్నికల్లోనే కాకుండా, ప్రభుత్వ ప్రైవేటు విద్యా, ఉద్యోగాల్లో బీసీల జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని, బహుజన వేదికరాష్ట్ర కన్వీనర్ కస్తూరి రాములు(Bahujan Vedika State Convener Kasturi Ramulu) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీలకే కాకుండా బలహీన వర్గాలకు కూడా చట్టసభలో రిజర్వేషన్లు కల్పించవచ్చునని రాజ్యాంగంలో వివరించబడింది. 70 ఏళ్ల స్వాతంత్ర భారత దేశంలో నేటికీ బలహీన వర్గాలు రాజ్యాధికారానికి దూరంగా నెట్టివేయబడ్డాయి అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బీసీలకు రిజర్వేషన్లు సాధించడానికి ఎస్సి, ఎస్టి వర్గాలు కూడా మద్దతు ఇవ్వాలని, ఎమ్మార్పీఎస్ నాయకుడు మందకృష్ణ మాదిగ,బిసి రిజర్వేషన్ల సాధనకు మద్దతు ప్రకటించడం పట్ల రాములు హర్షం వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్ పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు చిత్తశుద్ధితో వ్యవహరించాలని అన్నారు.