calender_icon.png 13 October, 2025 | 11:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూరియా తిని గొర్రెలు మృతి

13-10-2025 08:39:34 AM

నవాబ్ పేట :  మండల పరిధిలోని అమ్మాపూర్ గ్రామానికి చెందిన మంగలి ప్రభాకర్ చెందిన 12 మేకలు యూరియా తిని మృతి చెందాయి. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.  మంగలి ప్రభాకర్ జీవనం పూర్తిగా మేకల మీదనే ఆధారపడి ఉంది. ఉండడానికి ఇల్లు కూడా సైజు లేదు పూర్తిగా తన కుటుంబం మేకలను కాచుకుంటూ జీవనోపాధి పొందుతున్నాడు. ఉన్నటువంటి యూరియా మేకలు తినడంతో ఒకసారిగా 12 లే మేకలు మృత్యువాత పడ్డాయి. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి స్పందించి మేకల కాపరి మంగలి ప్రభాకర్ వారి కుటుంబ సభ్యులను ఆదుకోవాలని గ్రామస్తులు, మేకల కాపరి ప్రభాకర్ కోరుతున్నారు.