13-10-2025 09:44:15 AM
రైతన్నల కంట కన్నీరు.
రేగొండ,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షం(Heavy Rain) బీభత్సం సృష్టించింది. సోమవారం ఉదయం మేఘాలు చీకటి కమ్మి కుండ పోత వర్షం కురిసింది. రేగొండలో పిడుగులతో కూడిన వాన పడింది. దీంతో వరి, పత్తి, మిర్చి రైతులు తలలు పట్టుకున్నారు. భారీ వర్షానికి చేతికి వచ్చిన వరి పంట నాశనం అయ్యిందని రైతులు(Farmers) వాపోయారు. చేతికి వచ్చిన పత్తి చేతికందకుండానే చేన్లలోనే మురిగిపోతాయని, పత్తి కాయలు రాలి పోతాయని కన్నీరు పెట్టారు. మిరప తోటలు ఇప్పుడిప్పుడే కోలుకునే దశలోనే ఈ వానలతో పంటకు, వేరు కుళ్ళు వచ్చి చచ్చిపోతాయని అన్నారు. తమను ప్రభుత్వమే(Government) ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని రైతులను కోరారు.