13-10-2025 09:34:54 AM
చేగుంట: మెదక్ జిల్లా చేగుంటలో ఆరు నెలలుగా గణిత లెక్చరర్(Mathematics lecturer) రావడం లేదని చేగుంట పట్టణ కేంద్రం లో గల గిరిజన స్పోర్ట్స్ గురుకుల విద్యార్థినులు(Tribal Sports Gurukul students) సోమవారం ఉదయం గాంధీ చౌరస్తా వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థినులు మాట్లాడుతూ.. జూనియర్ కళాశాల రెండో సంవత్సరం చదువుతున్న తమకు ఆరు నెలలుగా గణితం బోధించడం లేదన్నారు. భవిష్యత్తు పై భయంతో రాస్తారోకో చేస్తున్నట్లు తెలిపారు. గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు గణితం బోధించేలా చర్యలు తీసుకుంటామని విద్యార్థినిలకు హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు.