calender_icon.png 13 October, 2025 | 12:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైలు కింద పడి కుటుంబం ఆత్మహత్య

13-10-2025 09:30:28 AM

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప(Kadapa) నగరంలో సోమవారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గూడ్స్ రైలు కింద పడి కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. ఏడాది బాబుతో పాటు భార్యాభర్తలు ప్రాణాలు తీసుకున్నారు. కడప రైల్వే స్టేషన్(Kadapa Railway Station) సమీపంలో ఆదివారం అర్దరాత్రి 11 గంటలకు ఈ ఘటన జరిగింది.ట్రైన్ వేగంగా ఢీకొట్టడంతో మృతదేహాలు చెల్లాచెదురుగా ఎగిరి పడ్డాయిమృతులను శంకరాపురానికి చెందిన శ్రీరాములు(35), శిరీష(30), రిత్విక్(ఏడాదిన్నర చిన్నారి)గా పోలీసులు గుర్తించారు. భార్యాభర్తలు గొడవ పడుతుండటంతో శ్రీరాములు నానమ్మ ఇద్దరిని మందలించింది. మనస్తాపం చెందిన దంపతులు ఇంటి నుంచి రాత్రి బయటకు వెళ్లి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. శ్రీరాములు ఇంటి నుంచి వెళ్లిపోయిన వెంటనే నానమ్మ గుండెపోటుతో మృతి చెందింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని  మృతదేహాలను రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు దర్యాప్తు చేస్తున్నారు.