4 July, 2026 | 1:02 AM

పాక్‌లో లోయలో పడిన బస్సు

04-07-2026 12:03 AM

మహిళలు, పిల్లలతో సహా 40 మంది మృతి

మరో ఎనిమిది మందికి గాయాలు

బలూచిస్థాన్ రాష్ట్రంలో షేరానీ జిల్లాలో ఘటన

ఇస్లామాబాద్, జూలై 3: పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలో ప్రయాణికులతో వెళ్తున్న ఒక బస్సు అదుపు తప్పి, లోయలో పడింది. ఈ ఘోర ప్రమాదంలో మహిళలు, పిల్లలతో సహా 40 మంది మరణించారు. మరో ఎనిమిది మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. పాకిస్థాన్ బలూచిస్థాన్ రాష్ట్రంలో షేరానీ జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది.

సమాచారం అందుకున్న షేరానీ జిల్లా ఉన్నతాధికారులు, వైద్యులు, పోలీసులు హుటా హుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను అత్యవసర చికిత్స కోసం ఝోబ్ లోని ట్రామా సెంటర్‌కు తరలించారు. వారి లో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బలూచిస్థాన్‌లోని క్వెట్టా నుంచి పెషావర్ వైపు వెళ్తున్న ఈ బస్సు, ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాకు చేరుకున్న తర్వాత ఈ ప్రమా దం జరిగిందని అధికారులు పేర్కొన్నారు.

బస్సు బ్రేకులు విఫలం కావడం వల్ల, పర్వత ప్రాంతంలోని ఒక కఠినమైన మలుపు వద్ద డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయారు. దీంతో బస్సు రోడ్డు పక్కకు జారి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 40 మంది మరణించారని, మరో ఎనిమిది మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఈ ఘటన జరిగినప్పుడు బస్సులో మొత్తం 48 మంది ప్రయాణికులు ఉన్నారని 1122 రెస్క్యూ టీమ్ (సహాయక బృందం) తెలిపింది.

క్వెట్టా నుంచి బయలుదేరేటప్పుడు బస్సులో 36 మంది ఉన్నారని, మిగిలిన వారు మార్గమధ్యలో ఎక్కారని ‘డాన్’ మీడియా పేర్కొంది. ఖైబర్ పఖ్తుంఖ్వాలోని పర్వత ప్రాంతాల్లో ప్రమాదకర మైన భూభాగం, తీవ్రమైన వాతావరణ పరిస్థితులు, తరచుగా జరిగే ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలు, అధ్వాన్నమైన రోడ్లు, వాహనాల పరిస్థితి బాగోలేకపోవడం, శిక్షణ లేని డ్రైవర్లు వంటి కారణాల వల్ల రోడ్డు ప్రమాదాలు తరచూ జరుగుతుంటాయి. అవి ప్రా ణాంతకంగా మారుతుంటాయి.