4 July, 2026 | 12:57 AM

ఈపీఎఫ్ ఖాతాల్లో అన్‌క్లెయిమ్డ్ సొమ్ము 9,330 కోట్లు

04-07-2026 12:01 AM

౩౧ లక్షల మంది నిరుపయోగ ఖాతాల్లో గుర్తింపు

ఎవరూ క్లెయిమ్ చేయకపోవడంతో మూలుగుతున్న నిధులు

ఆ నిధులు ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా వార్షిక బడ్జెట్‌కు సమానం

మూడు ఐఐటీ క్యాంపస్‌లు నిర్మించేంత సొమ్ము

కార్మికుల సొమ్మును వారికే అందేలా చూడాలనే డిమాండ్ మొదలు

న్యూఢిల్లీ, జూలై ౩: దేశవ్యాప్తంగా ప్రస్తుతం ౩౧ లక్షల మంది నిరుపయోగ ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) ఖాతాల్లో రూ.9,330 కోట్ల మేర అన్ క్లెయిమ్డ్ నిధులు నిలిచిపోయాయి. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా ఓ సామాజిక ఉద్యమకారుడు తాజాగా ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. ఈ సమాచారం మేరకు.. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే నిరుపయోగ ఖాతాల సంఖ్య స్వల్పంగా తగ్గింది. 31 మార్చి 2025 నాటికి 31.83 లక్షలు కాగా, ఈ ఏడాది మార్చి ౩౧ నాటికి 30.91 లక్షలకు తగ్గింది.

అలాగే, క్లెయిమ్ కాని సొమ్ము ఒక్కఏడాదిలో రూ.10,181 కోట్ల నుంచి రూ. 9,330 కోట్ల మేరకు తగ్గింది. ఖాతాల సంఖ్య యేటా తగ్గుతూ వస్తున్నప్పటికీ, కార్మికుల సొమ్ము కచ్చితంగా వారికి దక్కాల్సి వుంది. వారికి ఆ సొమ్ము అందకుండా ఉండటం విమర్శలకు తావిస్తున్నది. మరోవైపు, ఆధార్ కార్డుతో అనుసంధానమైన ఖాతాల వివరాలు వెల్లడించేందుకు, ఆటో సెటిల్‌మెంట్ స్టేటస్ వివరాలు వెల్లడించేందుకు ఈపీఎఫ్ యంత్రాంగం నిరాకరిస్తున్నదని ఆర్టీసీ ఉద్యమకారుడు చెబుతున్నాడు.

భద్రతకారణాల రీత్యా చట్టంలోని కొన్ని సెక్షన్ల ప్రకారం ఆ వివరాలను వెల్లడించలేమని స్పష్టం చేసిందని తెలిపారు. రూ.౫ లక్షల కన్నా ఎక్కువ సొమ్ము ఉన్న ఖాతాల వివరాలూ ఇతమిత్థం గా లేవని తేల్చిచెప్పిందన్నారు. ఈ నిధులు కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఉడాన్ పథకం నిధులతో సమానమని ఓ అంచనా. ‘ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా’ వార్షిక బడ్జెట్‌తోనూ ఈ నిధులు సరితూగడం గమనార్హం. రూ.9, 330 కోట్ల సొమ్ముతో దేశంలో మూడు కొత్త ఐఐటీలు నిర్మించవచ్చని కొందరు వి ద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. కార్మికులు కాయకష్టం చేసుకుని, దాచుకున్న రిటైర్మెంట్ సొమ్ము ఇలా క్లెయి మ్ కాకుండా ఉండటంపై దేశవ్యాప్తంగా చర్చకు దారి తీ సింది.