గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలి
ఆర్టీసీ డీఎంకు గ్రామస్తుల వినతి
మరిపెడ ,డిసెంబర్ 24 (విజయక్రాంతి)మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం తాళ్లవుకల్ గ్రామం మీదుగా బస్సును నడపాలని మహబూబాబాద్ ఆర్టీసీ డిఎం కు వినతి పత్రం ఇచ్చారు. మహబూబాబాద్ నుండి తాళ్ల ఊకల మీదగా సూర్యాపేటకు బస్సు సౌకర్యం గతంలో ఉండేదని కొన్ని కారణాలవల్ల ఆ రూట్ లో ఆర్టీసీ బస్సులు నిలిపియడం ద్వారా గ్రామానికి సరైన రవాణా సౌకర్యాలు లేక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
గత కొంతకాలంగా ఆర్టీసీ బస్సు సర్వీసు నిలిచిపోవడంతో విద్యార్థులు ఉద్యోగులు రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు ముఖ్యంగా పాఠశాలలకు ,కళాశాలలకు వెళ్లే విద్యార్థులు ,సకాలంలో చేరుకోలేక చదువుకు దూరం అవుతున్నారు ఆటోలను ఆశ్రయించాల్సి రావడంతో ఆర్థికంగా భారం అవ్వడమే కాకుం డా ప్రమాదకరంగా ప్రయాణించాల్సి వస్తుంది గ్రామస్తులు అనేకమార్లు అధికారులను విన్నవించిన ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కావున ఆర్టీసీ ఉన్నత అధికారులు స్పందించి వెంటనే తమ గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు ఆర్టీసీ డిఎం కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో తాళ్లవుకల్ గ్రామ సర్పంచ్ తప్పెట్ల శ్రీనివాస్, తిప్పేరి శ్రీనివాస్, కొంపెల్లి సురేందర్ రెడ్డి, కొంపెల్లి వేణుగోపాల్ రెడ్డి కొండపల్లి శ్రీకాంత్ కల్లంచర్ల తిరుపతి చిత్తలూరు ఎ ర్రమల్లయ్య గంధసిరి వెంకటేశు రామ గానే లింగమూర్తి పోతగాని కనకయ్య కొండపల్లి దేవయ్య కార్మికుల సురేష్ రాజలింగం శ్రీను హుస్సేన్ రోశయ్య లింగన్న నాగన్న తదితరులు పాల్గొన్నారు.






