25-12-2025 12:00:00 AM
ఎమ్మెల్యే జారె
ములకలపల్లి / దమ్మపేట, డిసెంబర్ 24, (విజయక్రాంతి): గ్రామాల అభివృద్ధి ద్వారా నే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అ న్నారు. బుధవారం దమ్మపేట మండలం కొమ్ముగూడెం గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం అశ్వారావుపేట మండలం ఆసుపాక గ్రామంలో నిర్మించిన కమ్యూనిటీ భవనాన్ని ప్రారంభించి మాట్లాడారు. గ్రామ పంచాయతీ భవనాలు ప్రజల సమస్యల పరిష్కారానికి కేంద్రబిందువులుగా ఉండాలన్నారు.
కమ్యూనిటీ భవనాలు గ్రామస్తుల సామాజిక కార్యక్రమాలకు ఎం తో ఉపయోగపడతాయన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి ద్వారానే రాష్ట్ర అభివృ ద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ప్రభు త్వం గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తుందని ప్రతి గ్రామం లో అవసరమైన ప్రభుత్వ భవనాలు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రజల సహకారంతో అశ్వారావుపేట నియోజకవర్గాన్ని ఆదర్శ నియో జకవర్గంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.