25-12-2025 12:00:00 AM
భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 24, (విజయక్రాంతి): రోడ్డు ప్రమాదాల నివారణకై పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలకు నిత్యం అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలనీ కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్ ఆదేశించారు. బుధవారం కొత్తగూడెం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్షన్ నిర్వహించారు.ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. ముందుగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో పని చేసే సిబ్బంది కోసం ప్రక్కనే ఉన్న భావనంలో విశ్రాంతి గదులను ప్రారంభించారు.
అనంతరం అక్కడ ఉన్న పోలీస్ అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని,పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులకు న్యాయం చేకూర్చే విధంగా బాధ్యతగా మెలగాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలు,సైబర్ నేరాలపై నిత్యం పట్టణ ప్రజలకు అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలను నడుపుతూ పట్టుబడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.
డిసెంబర్ నెల చివరి వారంలో స్పెషల్ డ్రైవ్ లు నిర్వహిస్తూ రోడ్డు ప్రమాదాలను అరికట్టడంలో తమ వంతు భాద్యతలను నిర్వర్తించాలని సూచించారు. రాంగ్ రూట్, ర్యాష్ డ్రైవింగ్,ట్రిపుల్ రైడింగ్ లకు పాల్పడే వారికి జరిమానాలు విధించాలని అన్నా రు.పోలీస్ స్టేషన్లో పనిచేసే అధికారులు,సిబ్బంది ప్రభుత్వ కిట్ ఆర్టికల్స్ ను తనిఖీ చేశారు.
ప్రతి ఒక్కరూ విధుల పట్ల నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ ప్రజలకు సేవలందించాలని కోరారు. చివరగా పోలీస్ స్టేషన్లో అధికారులు,సిబ్బంది మధ్యలో సెమీ క్రిస్మస్ వేడుకలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం 3టౌన్ సీఐ శివప్రసాద్,ట్రాఫిక్ ఎస్త్స్ర ప్రవీణ్ సురేష్,సిబ్బంది పాల్గొన్నారు.