ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రభంజనం
పెబ్బేరు, జూన్ 11: ప్రభుత్వ జూనియర్ కళాశాల 2026 ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించింది. మొదటి సంవత్సరం పరీక్షలకు హాజరైన 55 మంది విద్యార్థుల్లో 53 మంది ఉత్తీర్ణులై 96.49 శాతం ఫలితాన్ని నమోదు చేశారు. రెండో సంవత్సరం పరీక్షలు రాసిన 33 మందిలో 32 మంది పాస్ అయి 96.96 శాతం ఫలితాన్ని సాధించారు. ఎంపీసీ మొదటి సంవత్సరం విద్యార్థి బి. ఆశీర్వాదం 470 మార్కులకు గాను 449 మార్కులు సాధించి ప్రతిభ చాటాడు.
రెండో సంవత్సరం బైపీసీ విద్యార్థిని బి. అంజలి 1000 మార్కులకు గాను 864 మార్కులు సాధించింది. సీఈసీ మొదటి సంవత్సరం విద్యార్థి లోకేష్ 500 మార్కులకు గాను 324 మార్కులు పొందాడు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ భద్రసేన్ అధ్యాపకులు, విద్యార్థులను అభినందించారు. జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కె. నరేందర్ కుమార్ కళాశాలను సందర్శించి ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సత్కరించారు. క్రమశిక్షణతో చదివితే అద్భుత ఫలితాలు సాధించవచ్చని విద్యార్థులకు సూచించారు.
అలాగే రెండో సంవత్సరం విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. వనపర్తి జిల్లాలో అత్యుత్తమ సప్లిమెంటరీ ఫలితాలు సాధించిన కళాశాలగా పెబ్బేరు ప్రభుత్వ జూనియర్ కళాశాల నిలిచిందని అధికారులు అభినందించారు.






