calender_icon.png 18 July, 2025 | 1:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘మాసాబ్‌చెరువు కట్టపై బస్సులను నిలపాలి’

17-07-2025 12:19:15 AM

తుర్కయంజాల్, జులై 16:తుర్కయంజాల్ మాసాబ్చెరువు కట్టపై ఉన్న కట్టమైసమ్మ స్టాప్లో ఇబ్రహీంపట్నం డిపోకు చెందిన అన్ని బస్సులు నిలిపేలా చర్యలు తీసుకోవాలని సీపీఎం నేతలు కోరారు. ఈ మేరకు ఇబ్రహీంపట్నం డిపో మేనేజర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఎం ఇంజాపూర్ జోన్ బాధ్యుడు మండల సత్యనారాయణ, నాయకులు పొట్టేండ్ల శ్రీనివాసులు మాట్లాడుతూ కట్టమైసమ్మ స్టాప్లో బస్సులు మూడునెలల నుంచి బస్సులు నిలపడం లేదన్నారు.

దీంతో వివిధ పనుల నిమిత్తం నగరానికి వెళ్లే పేదలు, కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మేనేజర్ దృష్టికి తీసుకెళ్లారు. మున్సిపాలిటీ పరిధిలోని 22, 23, 24 వార్డులకు చెందిన సుందరయ్య కాలనీ, లక్ష్మీనగర్ కాలనీ, ఇందిరమ్మ కాలనీ, సాయినాథ్ కాలనీ, శ్రీరంగాపురం, శ్రీనివాస్ కాలనీ, ఆపిల్ ఎవెన్యూ, బొక్క నారాయణరెడ్డి కాలనీ, సాయిప్రియ కాలనీల ప్రజలు అవస్థలు పడుతున్నారని తెలిపారు.

ఈ కాలనీలకు చెందిన ప్రజలకు బస్సులు తప్ప మరో ప్రత్యామ్నాయం లేదన్నారు. ఇబ్రహీంపట్నం-హైదరాబాద్, హైదరాబాద్-ఇబ్రహీంపట్నం బస్సులను తప్పనిసరిగా నిలిపేలా చర్యలు తీసుకోవాలని మేనేజర్ను సీపీఎం నేతలు కోరారు. ఈ కార్యక్రమంలో సుందరయ్య నగర్ సీపీఎం శాఖ కార్యదర్శి ఐతరాజు కృష్ణ, నాయకులు బి.శంకరయ్య, కె.కుమార్, కె.సత్యం, జి.సాయి, ఎం. నరసింహ, జి.బాలయ్య తదితరులు పాల్గొన్నారు.