calender_icon.png 18 July, 2025 | 8:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భవిష్యత్ పౌరులకు సాంకేతిక పరిజ్ఞానం అవసరం

17-07-2025 12:20:18 AM

- ఏఐ కంప్యూటర్ ల్యాబ్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే అనిరుద్‌రెడ్డి 

మహబూబ్ నగర్ జూలై 16 (విజయ క్రాంతి) : భవిష్యత్తు పౌరులకు సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అవసరమని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్నారు. బుధవారం జడ్చర్లలో జడ్చర్ల కేంద్రంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎఐ కంప్యూటర్ ల్యాబ్ ను రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి యోగిత రానాతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ విద్యారంగానికి టెక్నాలజీ శక్తినిచ్చే అందించేందుకు ఏఐ కేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందని తెలిపారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు పోటీ ప్రపంచం లో ప్రతిభ కనబరచాలంటే అన్ని రంగాల్లో ముందు ఉండవలసిన అవసరం ఉందన్నారు. 

ప్రతి పాఠశాల సాంకేతిక అభివృద్ధికి వేదిక కావాలన్నారు. అనంతరం జడ్చర్ల లోని ప్రత్యేక అవసరాలు గల పిల్లల వనరుల కేంద్రాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు అధికారులుఉన్నారు.