calender_icon.png 17 July, 2025 | 4:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాల్యంలోనే భవిష్యత్తుకు సరైన పునాదులు వేయాలి

17-07-2025 12:18:51 AM

పెబ్బేరు జూలై 16 : పసిపిల్లలలో రోగనిరోధక శక్తి ని పెంపొందించటంలో మన పా త్ర స్పష్టంగా ఉండాలని, అదే క్రమంలో వి ద్యార్థుల్లో కృత్రిమ మేథ పై సమగ్ర అవగాహన కల్పించాల్సిన భాద్యత అందరిపై ఉం దని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అ న్నారు. శ్రీరంగాపూర్ మండల కేంద్రంలో ఆ రోగ్య ఉపకేంద్రాన్ని బుధవారం కలెక్టర్ సం దర్శించారు.

పిల్లలకు వ్యాధినిరోధక టీకాలు వేసే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. క్ర మం తప్పకుండా పిల్లలకు టీకాలు ఇవ్వటం తో పాటు, వారి కుటుంబానికి అవగాహన కల్పించాలని సూచించారు.  ఈ కార్యక్రమం లో కలెక్టర్ తో పాటు టీబి ప్రోగ్రాం ఆఫీసర్ సాయినాథ్ రెడ్డి, వైద్య సిబ్బంది, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.