మజ్జిగ పంపిణీ
27-05-2026 02:03 AM
కేసముద్రం, మే 26 (విజయక్రాంతి): మైసూరు అవధూత దత్త పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ 84వ పుట్టినరోజును కేసముద్రం దత్త హ్యూమన్ సర్వీస్, దత్త భక్తుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు అన్నదానము, మజ్జిగ వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మడూరి లింగమూర్తి, డాక్టర్ కటకం చంద్రశేఖర్, ఓలం గోవర్ధన్ , వెలిశాల దయానంద, లేగల విజయభాస్కర్ రెడ్డి, కొప్పుల శంకర్, ఉప్పుల వంశీ కుమార్, శీలం శ్రీనివాస్, బోడ రాజ్ కుమార్, రాజు, వెంకటేశ్వర్లు, రావుల విశ్వేశ్వర్ పాల్గొన్నారు.






