7 April, 2026 | 3:05 AM

సింగరేణి కార్మికులకు మజ్జిగ పంపిణీ

07-04-2026 12:55 AM

సత్తుపల్లి ఏప్రిల్ 6. ( విజయక్రాంతి): పెరిగిపోతున్న వేసవి ఉష్ణోగ్రతల దృష్ట్యా సింగరేణి కార్మికుల సంక్షేమానికి, ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ, సత్తుపల్లి ఏరియా జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ దిశానిర్దేశంలో ఏరియాలోని అన్ని విభాగాల్లో కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో భాగంగా జి.ఎం. కార్యాలయ సిబ్బందితో పాటు, జెవిఆర్ ఓసి ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎన్. ప్రహ్లాద్, కిష్టారం ఓసి ప్రాజెక్ట్ ఆఫీసర్ ఏ.ఎల్.ఎస్.వి. సునీల్ వర్మ, జెవిఆర్ సిహెచ్పి డిజిఎం (ఈ&ఎమ్) కె. సోమశేఖర రావుల ఆధ్వర్యంలో ఆయా విభాగాల ఉద్యోగులకు, కార్మికులకు మజ్జిగ అందజేశారు. గనుల్లో, కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది ఎండ దెబ్బకు గురికాకుండా ఉండేందుకు యాజమాన్యం, కార్మిక సంఘాలు సమన్వయంతో ఈ చర్యలు తీసుకుంటున్నాయని, పని ప్రదేశాలలో చల్లని మంచినీరు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు మజ్జిగను నిరంతరం అందుబాటులో ఉంచుతామని ఈ సందర్భంగా అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఏరియా అధికారులు, గుర్తింపు ప్రాతినిధ్య సంఘాల డెలిగేట్లు  సిబ్బంది పాల్గొన్నారు.