calender_icon.png 17 October, 2025 | 4:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

న్యాయ వ్యవస్థలో ప్రాధాన్యత సమస్య

17-10-2025 01:18:54 AM

చిన్న కేసుల విచారణ ముందు, ఆ తర్వాతే పెద్ద కేసులు 

గత సెప్టెంబర్ నాటికి సుప్రీంకోర్టులో 88,417 కేసులు పెండింగ్

భారత న్యాయవ్యవస్థలో మొత్తంగా 5.3 కోట్లకు పైగా..

కోర్టులో 34మంది  న్యాయమూర్తులున్నా కేసుల విచారణలో వేగం తక్కువగానే.. 

న్యాయపరమైన ప్రతిష్టంభనతో క్షీణిస్తున్న ప్రజల విశ్వాసం

హైదరాబాద్, అక్టోబర్ 16 (విజయక్రాంతి) : భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో న్యాయం రెండు మార్గాల్లో అమలవుతున్నది. చిన్న కేసుల విచారణను వెంటనే చేపడుతున్నప్పటికీ.. దేశం లో కీలకమైన కేసులు మాత్రం ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంటున్నాయి. 2025 సెప్టెంబర్ నాటికి సుప్రీంకోర్టులో మొత్తం 88,417 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో 69,553 సివిల్ కేసులు, 18,864 క్రిమినల్ కేసులు.

గతేడాదితో పోలిస్తే ఈ గణాంకాల్లో 7.6 శాతం పెరుగుదల కన్పిస్తుంది. అయితే, కోర్టులో 34 మంది న్యాయమూర్తులు ఉ న్నా కేసుల విచారణలో వేగం తక్కువగానే ఉంది. 2025లోనే 52,630 కొత్త కేసులు దాఖలయ్యాయి. కానీ అందులో పరిష్కరించినవి మాత్రం కేవలం 46,309(88 శాతం) మాత్రమే. ఈ క్రమంలో పెండింగ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. భారత న్యాయవ్యవస్థలో మొత్తం 5.3 కోట్లకు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.

జిల్లా కోర్టు ల్లో ముఖ్యంగా సివిల్ వివాదాలు దశాబ్దాలుగా నిలిచిపోయాయి. ఈ న్యాయపరమైన ప్రతిష్టంభన ప్రజల విశ్వాసాన్ని క్షీణించజేయడమే కాకుండా, కేసుల ప్రాధాన్యతల గురిం చి హెచ్చరికలు జారీ చేస్తుంది. అయితే, ఈ పరిస్థితి పౌర స్వేచ్ఛ, మానవహక్కులు, ప్రజాస్వామ్య పునాదులకు ముప్పు కలిగించే ప్రమాదం ఉంది. 

కోర్టు ప్రాధాన్యతలు ప్రశ్నార్థకం 

సుప్రీంకోర్టు విచారణలో సామాన్య విషయాలకే ఎక్కువ సమయం కేటాయిస్తోం దన్న విమర్శలు వస్తున్నాయి. 2025 ఆగస్టులో ఇషా ఫౌండేషన్‌కు చెందిన జగ్గీ వాసు దేవ్ సంస్థలో ఇద్దరు మహిళల నిర్బంధంపై పోలీసుల విచారణను సుప్రీంకోర్టు నిలిపివేసింది. విస్తృత సామాజిక అత్యవసరాల కంటే ఆధ్యాత్మిక గురువు వివాదాలకు ప్రా ధాన్యత ఇచ్చింది. 2025 జూన్‌లో ఒక సింగిల్ పేరెంట్ న్యాయమూర్తి తన పిల్లల సంరక్షణపై జార్ఖండ్ హైకోర్టుతో ఉన్న వివాదాన్ని సుప్రీంకోర్టు అత్యవసరంగా విచారించింది.

ఈ కేసులు దీపావళి పటాసుల నిషే ధం, ఐపీఎల్ షెడ్యూల్ వివాదాలు వంటి ‘తేలికపాటి’ కేసుల జాబితాలో నిలుస్తాయి. అయితే, ఈ కేసులు తరచుగా పెద్ద బెంచ్‌ల సమయాన్ని ఆక్రమిస్తున్నాయి. అదే సమయంలో పౌర హక్కులు, మానవ హక్కులు, ప్రజాస్వామ్య భవిష్యత్తు వంటి ముఖ్యమైన కేసులు మాత్రం సంవత్సరాలుగా వాయిదాల పర్వంలో కూరుకుపోయాయి. 2025 ఫిబ్రవరి నాటికి సుప్రీంకోర్టులో పెండింగ్ కేసుల్లో 65 శాతం వరకు ‘అడ్మిషన్ స్టేజ్’ వద్దే నిలిచిపోయినట్లు వార్షిక నివేదిక చెబుతోంది.

జూన్ 2025 నాటికి పెండింగ్ కేసు లు 85,204కి చేరి సంవత్సరంలోనే గరిష్ఠ స్థాయి దాటాయి. తగ్గిన పని దినాలు, తక్కు వ డిస్పోజల్ రేటు (కేవలం 21.94 శాతం) దీనికి ప్రధాన కారణాలు. చీఫ్ జస్టిస్ డి.వై. చంద్రచూడ్ నుంచి సంజీవ్ ఖన్నా వరకు ‘పాక్షిక పని దినాలు’, ‘రెసెస్ బెంచ్‌లు’ వంటి వ్యవస్థలు నడుస్తున్నా, వనరులు మాత్రం తక్కువ ప్రాధాన్యత కేసులకే వెళ్తున్నాయి.. అని న్యాయ నిపుణులు అంటున్నారు. 

రాజకీయ వ్యవహారాలపై కోర్టు ధోరణి... 

విపక్ష నాయకులపై నమోదవుతున్న కేసు ల్లో కూడా కోర్టుల ప్రవర్తనపై అనేక వాదనలు ఉన్నాయి. 2023లో భారత్ జోడో యాత్ర సందర్భంగా సాయుధ దళాలపై చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డిఫమేషన్ కేసు ఎదుర్కొవాల్సి వచ్చింది. ఆ కేసును 2025 ఆగస్టులో సుప్రీంకోర్టు నిలిపివేసినా ‘ఒక నిజమైన భారతీయుడు ఇలాంటి మాటలు అనడు’ పేర్కొంటూ బహిరంగంగా మందిలించింది.

ఈ నైతిక విమర్శా ధోరణి, విచారణలో రెండేళ్ల ఆలస్యం పక్షపాతం ఉందనే భావనను బలపరచింది. 2023లో 14 విపక్ష పార్టీలు ఈడీ, సీబీఐల దుర్వినియోగంపై దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సాక్ష్యాలు ‘తగినవి కావు’ అని చెప్పి తిరస్కరించింది. 2025 సెప్టెంబర్‌లో ఒక విపక్ష నాయకుడి బెయిల్ పిటిషన్‌ను మూడు సంవత్సరాలు జాబితాలో పెట్టకపోవడంపై కోర్టు దర్యాప్తునకు ఆదేశించింది.

వ్యవస్థాపక లోపం ఉన్నదని అంగీకరించినా, సంస్థాగత సంస్కరణలు మాత్రం తీసుకురాలేదు. 2025 జూన్ నాటికి దేశవ్యాప్తంగా 4.13 లక్షల ఆర్‌టీఐ అప్పీలు పెండింగ్‌లో ఉన్నా యి. ఇది రాజకీయ దుర్వినియోగాలపై పారదర్శకతను అడ్డుకుంటోంది. అంతర్జాతీయ న్యాయ నిపుణుల కమిషన్ నివేదిక భారత న్యాయవ్యవస్థ ‘ఎగ్జిక్యూటివ్ పక్షాన తూలిపోతోందని’ తీవ్ర విమర్శ చేసింది. 

మానవ హక్కుల ఉల్లంఘనలపై అమెరికా ఆందోళన

2025లో అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ నివేదిక భారతదేశంలో ‘అక్రమ హత్యలు, కస్టడీ హింస’ వంటి అంశాలను ‘నమ్మదగిన నివేదికలు’గా పేర్కొంది. న్యాయపరమైన జడత్వం శిక్షార్హతను లేకుండా చేస్తుందని, సోషల్ మీడియాలో ప్రజల ఆగ్రహం పెల్లుబికుతుంది. ‘పేదలకు పెండింగ్, పెద్దలకు ప్రాధాన్యం’ అనే వ్యాఖ్యలు ట్విటర్‌లో వైరల్ అవుతున్నాయి. 2023లో ప్రారంభించిన ఈటూ ఏఐ ఆధారిత కేసు వర్గీకరణ వంటి సంస్కరణలు కోర్టు ఖాళీలు, సిబ్బంది కొరతల కారణంగా అమలుకాకుండా నిలిచిపోయాయి.

హైకోర్టుల్లోనే 63 లక్షల కేసులు పెండింగ్‌లో ఉండటం పరిస్థితి తీవ్రతను చూపుతోంది. చీఫ్ జస్టిస్ బీ.ఆర్. గవాయ్ వేసవి సెలవుల్లో ప్రత్యేక బెంచ్‌లు ఏర్పాటు చేసి కొన్ని కేసులు పరిష్కరించినా మొత్తం పెండింగ్ కేసుల ఆటుపోటులను అడ్డుకోవడం సాధ్యంకాలేదు. భారత సుప్రీంకోర్టు ఒకప్పుడు ప్రజాస్వామ్యానికి రక్షకుడిగా పరిగణించారు. కానీ, ఇప్పుడు అది నిశ్శబ్ద వీక్షకుడిగా మారుతోందని విమర్శలు తీవ్రం అవుతున్నాయి.

దేశంలోని 4.6 కోట్లు లోయర్ కోర్టు కేసులు పెండింగ్‌లో ఉండ గా, సుప్రీంకోర్టు తీర్పుల ఆలస్యం ప్రజల్లో న్యాయంపై నమ్మకాన్ని చెరిపేస్తోంది. హక్కులకు కంటే ఆచారాలకు ప్రాధాన్యం ఇస్తే, న్యాయం ఆలస్యమవదు.. అదృశ్యమవుతుం ది. అది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యాన్ని లోపలి నుంచి ఖాళీ చేస్తుంది. 

మార్చి 2025లో ‘యూరేషియా రివ్యూ’లో వచ్చిన వ్యాసం

భారత న్యాయవ్యవస్థ ‘హిందూత్వ ఒత్తిడికి తలవంచిందని’ తీవ్రంగా విమర్శిం చింది. పౌరసత్వచట్టం, దేశద్రోహం చట్టాలపై ఉన్న సవాళ్లను తీర్పు లేకుండా వాయి దాలు వేస్తూ విపక్ష స్వరాలను మౌనం చేసే ప్రయత్నం జరుగుతోందని పేర్కొంది. ఆక్స్‌ఫర్డ్ విశ్లేషణ ప్రకారం చీఫ్ జస్టిస్ కార్యా లయం కూడా ‘అస్పష్ట నియామకాలు, బెంచ్ కేటాయింపుల్లో అసమానత’ ద్వారా ప్రభుత్వ పిటిషన్లకు ప్రాధాన్యత ఇస్తోందని తేల్చింది.

సుప్రీంకోర్టు 2024 ఫిబ్రవరిలో ఎలక్టోరల్ బాండ్స్‌ను ‘రాజ్యాంగ విరుద్ధమని’ కొట్టివేసినప్పటికీ సుమారు రూ. 16,000 కోట్ల రాజకీయ నిధులు బీజేపీకి అధికంగా వెళ్లా యని వెల్లడించింది. అయి నా, అదే కోర్టు తర్వాత ఈవీఎం పారదర్శకత, మోడల్ కోడ్ ఉల్లంఘన వంటి ఎన్నికల ఫిర్యాదులను 2025కి వాయిదా వేసింది. వోటర్ జాబితాల మోసాలు, ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలు వంటి విషయాలు సకాలంలో విచారణకు రాకపోవడం వల్ల ఎన్నికల నమ్మకం దెబ్బతింటోంది. 2024లో ఏ1 జజీరా నివేదిక కూడా పార్టీకి నిధుల కింద ‘క్విడ్ ప్రో కో’ వ్యవహారాలు ఉన్నాయని వెల్లడించింది. 

తీర్పులు ప్రభుత్వానికే అనుకూలమా...

న్యాయ స్థానాల్లో తీర్పులు తరుచుగా ప్రభుత్వాల వైపు మొగ్గు చూపుతున్నాయి. 2025 సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టు వక్ఫ్ (సవరణ) బిల్లుపై ఇచ్చిన తీర్పు ప్రభుత్వం చేసిన మార్పులను ‘తాత్కాలిక రక్ష ణ చర్యలు’గా అంగీకరించింది. విప క్ష పార్టీలు దీనిని ‘అల్పసంఖ్యాకుల హక్కులను దెబ్బతీసే కుట్ర’గా అభివర్ణించినా, కోర్టు ‘పార్లమెంట్‌దే తుది నిర్ణయం’ అని చెప్పి ప్రభుత్వానికి ఊర ట ఇచ్చింది. ఇండియా బ్లాక్‌తో సహా విమర్శకులు దీనిని ప్రభుత్వ కుట్ర అని విమ ర్శించారు. ఇటీవలి తీర్పుల్లో కూడా ప్రభుత్వ పక్షాన తీర్పులు రావడం ఒక సాధారణ ధోరణిగా మారిందని, ఇది యాదృచ్ఛికం కాదని విమర్శకులు అంటున్నారు. 

మానవ హక్కులు, రాజకీయ దుర్వినియోగాల మధ్య న్యాయవ్యవస్థ

మానవ హక్కులు, రాజకీయ దుర్వినియోగాల మధ్య న్యాయవ్యవస్థ తూలుతు న్నది. విచారణల వాయిదాలు, పక్షపాత భావనలతో కోర్టుల విశ్వసనీయతకు పెను సవాల్‌గా మారింది. మానవ హక్కులు, పౌర స్వేచ్ఛలకు సంబంధించిన కేసుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ప్రభుత్వ దుర్వినియోగానికి చిహ్నంగా నిలిచిన భీమా కొరెగావ్ కేసులో 2024లో ఇద్దరు యూఏపీఏ నిందితులకు కేవలం విచారణ ఆలస్యం, బలహీన సాక్ష్యాల కారణంగా మాత్రమే బెయిల్ లభించింది.

విచారణ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. 2024లో జాతీయ మానవ హక్కుల సంఘం నమోదు చేసిన గణాంకాల ప్రకారం 121 పోలీస్ కస్టడీ మరణాలు, 1,558 జ్యుడీషియల్ కస్టడీ మర ణాలు చోటుచేసుకున్నాయి. 2023లో సుప్రీంకోర్టు కస్టడీ హింసపై పరిహారం, విచారణ తప్పనిసరి అన్న తీర్పు ఇచ్చినా, అమలు మాత్రం జరిగింది మాత్రం తక్కువే. పోలీస్ ఎన్‌కౌంటర్లు, అదృశ్యాలు, అక్రమ నిర్బంధాలపై దాఖలైన పిటిషన్లు కూడా పెండిం గ్‌లో కూరుకుపోయాయి.

హ్యూమన్ రైట్స్ వాచ్ ఈ పరిస్థితిని ‘వ్యవస్థాత్మక వ్యాధి’గా పేర్కొంది. దీంతోపాటు సివిల్ హక్కుల కేసులు కూడా దెబ్బతిన్నాయి. 2025 ఏప్రిల్‌లో అలహాబాద్ హైకోర్టులో 40 ఏళ్లుగా కొనసాగుతున్న ఒక హత్యాచార కేసు మళ్లీ వెలుగులోకి వచ్చింది. సుప్రీంకోర్టు పర్యవేక్షణ ఉన్నా, న్యాయం ఎంత నిదానంగా అమ లవుతుందో చెప్పేందుకు ఇది సరైన ఉదాహరణ.

2024 జనవరి నాటికి సుప్రీంకోర్టులో 80,221 కేసులు పెండింగ్‌లో ఉండగా, దేశవ్యాప్తంగా ఖైదీల్లో 77 శాతం మంది అండర్ ట్రయల్ (విచారణ ఎదురుచూస్తున్న వారు) అని రికార్డులు చెబుతున్నాయి. 2025 నా టికి ఈ శాతం మరింత పెరిగింది. ‘వేగంగా న్యాయం’ అనే రాజ్యాంగ హక్కు ఇప్పుడు ధనవంతులకే లభించే ప్రత్యేక హక్కుగా మారిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.