09-01-2026 12:00:00 AM
-నేడు నల్లబ్యాడ్జీలతో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు
-ఫిబ్రవరి 5న ఢిల్లీలో పార్లమెంట్ మార్చ్
వెంకటాపూర్, జనవరి 8 (విజయక్రాంతి): సీనియర్ ఉపాధ్యాయులను ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నుంచి మినహాయించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమానికి పిలుపునిచ్చారు. ఈ నెల 9న నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరై నిరసన తెలపాలని, ఫిబ్రవరి 5న ఢిల్లీలో నిర్వహించనున్న పార్లమెంట్ మార్చ్ను విజయవంతం చేయాలని స్టేట్ టీచర్స్ యూనియన్ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి ఏళ్ళ మధుసూదన్ ఒక ప్రకటనలో తెలిపారు.
జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపి) ప్రభుత్వ విద్యకు తీవ్ర నష్టం కలిగిస్తోందని, పాఠశాలల మూసివేతలు, విలీనాలను తక్షణమే నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం, ఎన్సీటీఈలే బాధ్యత వహించాలని పేర్కొన్న ఆయన, తక్షణమే సుప్రీంకోర్టులో రివ్యూ లేదా క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేయాలని, లేదా సీనియర్ ఉపాధ్యాయులకు రక్షణ కల్పించేలా విద్యా హక్కు చట్టాన్ని సవరించాలని డిమాండ్ చేశారు.