calender_icon.png 10 January, 2026 | 12:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమస్యల పరిష్కారానికి వార్డుల సందర్శన

09-01-2026 12:00:00 AM

సర్పంచ్ పంతకాని సడవలి 

కాటారం, జనవరి 8 (విజయక్రాంతి): సమస్యల పరిష్కారానికి పంచాయతీ పాలకవర్గం వార్డుల సందర్శన కార్యక్రమాన్ని చేపడుతున్నామని కాటారం సర్పంచ్ పంతకాని సడవలి తెలిపారు. గురువారం పంచాయితీ పరిధిలోని మూడో వార్డులో ఉప సర్పంచ్ కొండగొర్ల బానయ్యతో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మూడవ వార్డు మెంబర్ బొడ్డు సునీత సడవలి ప్రజా సమస్యలను వివరించారు.

డ్రైనేజీని ఏర్పాటు చేయాలని, బోర్వెల్ మంజూరు చేయాలని, సిసి రోడ్డు నిర్మించాలని, మంచినీటి సదుపాయం కల్పించాలని, విద్యుత్ దీపాలను అమర్చాలని గ్రామ ప్రజలతో కలిసి వార్డు మెంబర్ బొడ్డు సునీత సడవలి పంచాయతీ పాలక వర్గానికి విన్నవించారు. పంచాయతీ ఎన్నికల అనంతరం మొదటిసారిగా వార్డు సందర్శనకు వచ్చిన సర్పంచ్ పంతకాని సడవలి, ఉపసర్పంచ్ కొండగొర్ల బానయ్య లను వార్డ్ మెంబర్ బొడ్డు సునీత సడవలితో పాటు పలువురు గ్రామ ప్రజలు శాలువాలతో సత్కరించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా సర్పంచ్ పంతకాని సడవలి, ఉపసర్పంచ్ కొండ గొర్ల బానయ్య ప్రజలకు హామీ ఇచ్చారు.