17 April, 2026 | 2:26 PM

Breaking News

తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •   శ్రీ భీమేశ్వర స్వామి సేవలో ఐజీపీ రమేష్ నాయుడు   •  

ప్రశాంతంగా గురుకుల ప్రవేశ పరీక్ష

29-04-2024 01:49 AM

పెద్దపల్లి, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల కళాశాలల్లో ఇంటర్, డిగ్రీ ప్రవేశాలకు ఆదివారం నిర్వహించిన పరీక్ష ప్రశాంతంగా జరిగింది. పెద్దపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని అదనపు కలెక్టర్ జీవీ శ్యామ్‌ప్రసాద్ లాల్  తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెద్దపల్లి జిల్లాలో మొత్తం ఐదు కేంద్రాల్లో పరీక్ష నిర్వహించామని, 1,263 మంది విద్యార్థులకుగాను 1,140 మంది హాజరైనట్లు ప్రకటించారు. 

మంచిర్యాల జిల్లాలో..

మంచిర్యాల, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): మంచిర్యాలలోని ఎనిమిది కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. 1,327 మంది విద్యార్థులు ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోగా 1,201 మంది హాజరయ్యారని, డిగ్రీలో ప్రవేశాలకు 578 మంది దరఖాస్తు చేసుకోగా 540 మంది హాజరైనట్లు పరీక్షల జిల్లా కన్వీనర్ శ్రీధర్ తెలిపారు. జిల్లాలోని పరీక్ష కేంద్రాలను జాయింట్ సెక్రటరీ తిరుపతి సందర్శించారు.