17 April, 2026 | 2:42 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

శ్రీ భీమేశ్వర స్వామి సేవలో ఐజీపీ రమేష్ నాయుడు

17-04-2026 01:32 PM

వేములవాడ, ఏప్రిల్ 17,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడలో తెలంగాణ రాష్ట్ర రైల్వే,రోడ్డు భద్రత ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీపీ) రమేష్ నాయుడు శుక్రవారం భక్తిశ్రద్ధలతో శ్రీ భీమేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ ఆలయం, శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధంగా ఉండటం విశేషం.

ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న ఐజీపీకి అర్చకులు, వేద పండితులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు.దర్శనం అనంతరం ఆలయ మండపంలో అర్చకులు స్వామివారి శేషవస్త్రం కప్పి,లడ్డూ ప్రసాదాన్ని అందజేసి ఆశీర్వచనం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ వీరప్రసాద్, ఆర్‌ఐ సురేష్, ఎస్సైలు, ప్రోటోకాల్ ఏఈఓ జి. అశోక్ కుమార్, ఆలయ పర్యవేక్షకులు ఎన్. రాజేందర్ తదితరులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.