7 March, 2026 | 3:52 PM

ప్రైవేట్ పాఠశాలలు వద్దు.. ప్రభుత్వ పాఠశాలలే ముద్దు

07-03-2026 02:04 PM

పాల్వంచ (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల(Government Schools) బలోపేతం చేయటంలో భాగంగా గత రెండు రోజులుగా ప్రైవేటు పాఠశాలలు(Private Schools) వద్దు ప్రభుత్వ పాఠశాలలే ముద్దు అనే నినాదానంతో ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు మన ఊరి బడిలోనే చదువుకుందామని నినాదాలు చేస్తూ ఎర్రగుంట ,జగ్గు తండ గ్రామంలలో విద్యార్థిని విద్యార్థులు సాంస్కృతిక వేషధారణలో ప్రదర్శన నిర్వహించారు.

ప్రభుత్వ బడి ప్రాధాన్యతను వివరిస్తూ ఇటీవల కాలంలో ప్రభుత్వ పాఠశాలలో పెరిగిన సాంకేతిక బోధనోపకరణాలైన ఐఎఫ్బీ టీవీలు, డిజిటల్ టీవీలు , మంచినీటి సౌకర్యం, మరుగుదొడ్ల సౌకర్యం, నాణ్యమైన మధ్యాహ్న భోజన పథకం,ఉచిత పాఠ్యపుస్తకాలు, ఉచిత నోట్ పుస్తకాలు, ఉచిత దుస్తులు, ఆహ్లాదకరమైన వాతావరణంలో బోధన గురించి గ్రామస్తులకు వివరించడం జరిగింది.

ఇప్పటికే ప్రైవేటు పాఠశాలల వారు క్యాంపెయిన్ ప్రోగ్రాం నిర్వహించడంతో వారిని దీటుగా ఎదుర్కొని ప్రభుత్వ బడి బలోపేతానికి చేసిన ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి. వెంకటేశ్వరరావు(DV) ,సుధారాణి , లచ్చిరాం సార్,శోభ మేడం గారు,కామేష్ సార్,వెంకన్న సార్,నరేష్ సార్, శిల్పిషా మేడం, స్వర్ణలత మేడం మరియు కవిత మేడం పాల్గొన్నారు.