08-12-2025 12:00:00 AM
ఎర్రుపాలెం డిసెంబర్ 7 (విజయ క్రాంతి): మండల వ్యాప్తంగా స్థానిక సంస్థలకు జరుగుతున్న పంచాయతీ ఎన్నికలలో నామినేషన్ల ఉపసంహరణ అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థులు గ్రామాలలో ప్రచారం హోరహోరిగా సాగిస్తున్నారు. మండలంలోని ఆరు గ్రామపంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికయినాయి. మిగిలిన 26 గ్రామ పం చాయతీ సర్పంచి అభ్యర్థులు, వార్డులలో పోటీ చేసే అభ్యర్థులు కు మధ్య పోటీ రావడంతో గ్రామాలలో ప్రచారం హోరాహోరీ గా నడుస్తుంది.
మండలంలోని కాంగ్రెస్ పా ర్టీ రెండు వర్గాలుగా చీలిపోవడంతో గ్రామాలలో రెండు వర్గాల వారు తమ అభ్యర్థుల ను ఒకే గ్రామంలో పోటీకి ఉంచడంతో కొన్ని గ్రామాలలో ఒకే పార్టీ మధ్య అభ్యర్థు ల పోటీ అనివార్యమైంది. గ్రామ పంచాయతీకి జరుగుతున్న ఎన్నికలను అభ్యర్థులు ప్ర తిష్టాత్మకంగా తీసుకోవడంతో గ్రామాలలో ప్రచా రం నువ్వా నేనా అన్నట్లుగా హోరాహోరీ స్థా యిలో సాగుతున్నది.కాంగ్రెస్ బ లపరిచిన అభ్యర్థుల మధ్య గ్రామాలలో పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో గ్రామాల్లో ఉదయం నుండి సా యంత్రం ఐదు గంటల వరకు ప్రచారాన్ని అభ్యర్థులు నిర్వహిస్తున్నారు.
గ్రామాల్లో పోటీగా ఉన్న అభ్యర్థులు తమ కార్యకర్తలతో ప్రజలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహి స్తూ తమకే ఓటు వేయాలని ఓటర్లను ప్రస న్నం చేసుకునేందుకు తాము గెలిస్తే గ్రామం లో ఏ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తాము తెలియజేస్తూ ప్రచారాన్ని నిర్వహి స్తున్నారు. మండలంలో టిఆర్‌ఎస్ పార్టీ మద్దతుతో పోటీ చేస్తున్న అభ్యర్థులు కూడా గ్రామాల్లో ప్రచారం పోటా పోటీగా నిర్వహి స్తూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.
గోడపత్రికలు, పోటీ చేసే అభ్యర్థులు తమకు ఎన్నికల సంఘం కేటాయించిన గుర్తులతో అభ్య ర్థులు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ పోటా పోటీ గా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు ప్రచారం నిర్వహిస్తు న్నారు. సిపిఎం పార్టీ వివిధ గ్రామాలలో టిఆర్‌ఎస్ పార్టీ మద్దతుతో ఎన్నికల్లో పోటీ చేస్తున్నది. సిపి ఎం పార్టీ తమ అభ్యర్థుల పోటీ చేసే గ్రామాలలో పోటాపోటీ ప్రచా రం చేస్తూ గ్రామ అభివృద్ధికి పాల్పడుతామని వివరిస్తూ ప్రచారాన్ని కొనసాగిస్తున్న ది. ఈ ఎన్నికల్లో బిజెపి పార్టీ బల్పర్చిన అభ్యర్థులు ఒకటి రెం డు గ్రామాలకి పరిమితమై పోటీ చేస్తున్నారు.
వీరి ప్రచారం గ్రామాలలో నామ మాత్రంగానే కొనసాగుతున్నది. వివిధ గ్రామాలలో పోటీ చేస్తున్న అభ్యర్థులలో ఎక్కువమంది యువత, మహిళలు ఉండడంతో ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాజకీయ పార్టీ లు తమ అభ్యర్థులు ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని దానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ అభ్యర్థులకు సూచనలను అంది స్తూ గ్రామాలలో ప్రచార కార్య క్రమాలను, రాజకీయ సమీకరణాలను,
వివి ధ వర్గాల నుండి మద్దతును కూడ కట్టడంలో అన్ని పార్టీలు ప్రణాళికల ద్వారా ముందుకు వెళ్లి ఈ ఎన్నికల్లో ఎట్లైనా సరే తమ అభ్యర్థులే గెలవాలని అహర్నిశలు కృషి చేస్తూ కార్యకర్తలకు మనోధర్యాన్ని కల్పిస్తూ గెలుపుపై ధీమాతో ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. గ్రామాలలో ఈ ఎన్నికలు అభ్యర్థుల మధ్య ఎంతో రసవత్తంగా కొనసాగుతున్నాయి. చివరకు గ్రామాలలో ఎవరు గెలుస్తారో వేచి చూడాల్సిందేనని ప్రజలు గమనిస్తున్నారు.