30 June, 2026 | 4:19 PM

అజాగ్రత్తగా ఉండొద్దు!

27-05-2024 12:05 AM

సీజనల్ వ్యాధులు పలు రకాలుగా ఉంటా యి. కొందరిలో దగ్గు, జర్వం, జలుబు, డెంగీ ఫీవర్ రావొచ్చు. విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. డెంగీ ఫీవర్ దోమల ద్వారా వ్యాప్తి చెందు తుంది. దోమలను రెండు రకాలుగా విభజిస్తారు. ఒకటి, రాత్రిపూట కుట్టే దోమలు. రెండు పగటి వేళ కుట్టేవి. అనాఫిలిస్, క్యూలెక్స్ దోమలు రాత్రిపూట కుడతాయి. వీటి వల్ల మలేరియా, ఫైలేరియా (బోదకాలు), మెదడువాపు వంటివి వస్తాయి. ఇవి పగలు మాత్రమే కుడతాయి. ఇతర దోమల్లా మురుగు నీటిలో ఉండవు. నిల్వ ఉన్న మంచి నీటిలో.. అంటే ఇళ్లలోని పూల కుండీలు, కూలర్‌లు, ఇంటి పరిసరాల్లో నీరు నిలిచిన కుంటలు, రబ్బ రు టైర్లు వంటివాటిలో ఉన్న నీటిలో వృద్ధి చెందుతాయి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా పిల్లలు డెంగీ బారినపడే ఆస్కారం ఉంది. డెంగీ లక్షణాలు చూసినట్లయితే.. ఫీవర్, తలనొప్పి, వాంతులు, విరేచన లు, ప్లేట్ లేట్లు పడిపోవడం, బీపీ తగ్గడం వంటివి కనిపిస్తాయి. రెండు లేదా మూడు రోజులు అయి న పిల్లల్లో జర్వం తగ్గకుంటే వెంట నే వైద్యుణ్ని సంప్రదించాలి. ఈ ప్రభావం కొన్నిసార్లు గుండె మీద పడే అవకాశం కూడా ఉంటుంది. డెంగీ అనేది శరీరంలోని ఏదైన అవయవం మీద తన ప్రభావాన్ని చూపుతుంది. ఇది చాలా ప్రమాదకరం. 

 డాక్టర్ వి.జనార్దన్ రెడ్డి, 

సీనియర్ పీడియాట్రిషియన్

మెడికోవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్

04068334455