25 March, 2026 | 1:52 AM

కెన్ ఫిన్ హోమ్స్ లిమిటెడ్ భారీ విరాళం

25-03-2026 12:00 AM

రూ.౧౮ లక్షల విలువైన పరికరాలు కొండాపూర్ జనరల్ హాస్పటల్‌కి అందజేత

హైదరాబాద్, మార్చి 24(విజయక్రాంతి): కొండాపూర్‌లోని జనరల్ హాస్పిటల్‌లో మం గళవారం సీఎస్‌ఆర్ కార్యాచరణ కింద కెన్ ఫి న్ హోమ్స్ లిమిటెడ్ సుమారు రూ.18,90, 950 విలువైన పరికరాలను విరాళంగా అందజేశారు.౧౨ఎల్‌ఈడీ ఈసీజీ యంత్రాలు ౨, హాస్పిటల్ గ్రేడ్ నెబ్యులైజర్లు ౧౦, హాస్పిటల్ సక్షన్ ఉపకరణం ౫, ఐవీ స్టాండ్లు 50, ఆసుపత్రి వినియోగానికి స్టెరిలైజర్లు 1, నెబ్యులైజర్ ౧౦ కొండాపూర్ జనరల్ హాస్పిటల్‌కి విరాళం గా అందజేశారు.

ఈ కార్యక్రమంలో కెన్ ఫిన్ హోమ్స్ లిమిటెడ్ నుంచి ముఖ్య అతిథిగా గుడా లక్ష్మణ్ (అసిస్ వైస్ ప్రెసిడెంట్) అండ్ తెలంగాణ జోనల్ హెడ్, భిశెట్టి రవికుమార్ (సీనియర్ మేనేజర్ -గచ్చిబౌలి బ్రాంచ్), మాడిశెట్టి దివ్య (మేనేజర్ - గచ్చిబౌలి బ్రాంచ్) కొం డాపూర్ జనరల్ హాస్పిటల్ నుంచి డాక్టర్ జి. అనురాగిణి రెడ్డి (డీసీహెచ్‌ఎస్ రంగారెడ్డి జిల్లా), అండ్ డాక్టర్ చంద్ర కిషోర్ (హాస్పిటల్ సూపరింటెండెంట్), సిబ్బంది పాల్గొన్నారు.