25 March, 2026 | 2:11 AM

‘మెడికవర్’ వైద్యుల సమావేశం

25-03-2026 12:00 AM

హైరిస్క్ గర్భధారణలు, అకాల శిశువులకు చికిత్సపై అవగాహన

హైదరాబాద్, మార్చి 24 (విజయక్రాంతి): వరంగల్ జిల్లాలో హైరిస్క్ గర్భధారణలు, అకాల శిశువులకు ప్రత్యేక వైద్యం అందిస్తున్నట్టు మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. జాతీయ ఆరోగ్య గణాంకాల ప్రకారం, ప్రపంచంలో జరిగే అకాల ప్రస వాల్లో దాదాపు మూడవ వంతు భారత్‌లోనే జరుగుతున్నాయి. ప్రతి పది మంది శిశువుల్లో ఒకరు అకాలంగా జన్మిస్తుండగా, వీరిలో చాలామందికి జన్మించిన తొలి గంటలోనే (గోల్డెన్ అవర్) ప్రత్యేక నీయోనేటల్ చికిత్స అవ సరం అవుతోంది.

హైదరాబాద్‌లోని మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్‌కు చెందిన సీనియర్ నీయోనేటాలజిస్ట్ డా. రవీందర్‌రెడ్డి పరిగె, పీడియాట్రిక్ సర్జన్ డా. మధుమోహన్, మెడికవర్ హాస్పిటల్స్‌లో మీడియాతో మాట్లాడారు. హై రిస్క్ తల్లులు, అకాల శిశువుల వైద్య నిర్వహణపై వివరించారు. నెలలు నిండకుండా జన్మించిన శిశువుల జీవన శాతం, వారి దీర్ఘకాలిక అభివృద్ధి ఆధునిక వైద్య సదుపాయాలతో పాటు, సమయానుకూల నిర్ణయాలు, అనుభవజ్ఞులైన వైద్యులు, విభాగాల మధ్య సమ న్వ యంపై ఆధారపడి ఉంటాయని వైద్యులు తెలిపారు.

23 వారాల్లో జన్మించిన శిశువుల కు ఆధునిక శ్వాస సహాయం, ఇన్ఫెక్షన్ నియంత్రణ, పోషకాహార నిర్వహణ నిరంతర పర్యవేక్షణ అత్యంత అవసరమని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని మెడికవర్ హాస్పిటల్లో అత్యాధునిక ఎన్‌ఐసీయూ సదుపాయాలు, 24 గంటల నీయోనేటాలజీ సేవలు, పీడియాట్రిక్ సర్జరీ మద్దతు, ప్రత్యేకంగా శిక్షణ పొందిన నర్సింగ్ సిబ్బంది అందుబాటులో ఉన్నాయని తెలిపారు. హై రిస్క్ గర్భధారణలు, నవజాత శిశువుల సమస్యలను తొలిదశలోనే గుర్తించి సరైన కేంద్రాలకు రిఫర్ చేస్తే చికిత్స ఫలితాలు మెరుగ్గా ఉం టాయని అన్నారు. 

డా. వరలక్ష్మీ కెఎస్, సీనియర్ కన్సల్టెంట్ ఆబ్‌స్టెట్రిషియన్ అండ్ గైన కాలజిస్టు మాట్లాడుతూ.. అధిక ప్రమాద గర్భధారణలను తొలిదశలోనే గుర్తించడం అత్యం త అవసరమని తెలిపారు. నియమిత గర్భకాల పరీక్షలు, సమయానికి అవసరమైన పరీక్షలు, వైద్య నిపుణుల సమన్వయం ద్వారా తల్లి-శిశువు సంక్లిష్ట తలను తగ్గించి, అధిక ప్రమాద గర్భధారణలలో కూడా సురక్షిత ప్రసవాలను సాధిం చవచ్చని ఆమె పేర్కొన్నారు.