25 March, 2026 | 2:08 AM

ఎస్‌ఆర్‌ఆర్ ఫౌండేషన్ రూ.21 వేలు విరాళం

25-03-2026 12:00 AM

అరేగూడెంలో శ్రీరామ నవమి ఉత్సవాలు

వరంగల్, మార్చి 24(విజయక్రాంతి): వరంగల్ జిల్లా రాయపర్తి మండలం అరేగూ డెం గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించనున్న తీరు కల్యాణ మహోత్సవాల కోసం ఎస్‌ఆర్‌ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 21వేల రూపాయలు విరాళం అందజేశారు. ఈ విరాళాన్ని ఎస్‌ఆర్‌ఆర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా నాయకులు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి అందించారు.

ఇటీవల గ్రామ పర్యటనలో భాగంగా స్థానిక ఉత్సవ కమిటీ సభ్యులు చేసిన విన్నపం మేరకు శ్రీఆంజనేయ స్వామి ఆలయంలో ప్రహరీ నిర్మాణ పనులకు 2026 సంవత్సరానికి సంబంధించిన శ్రీరామనవమి తీరు కల్యాణ మహోత్సవాల నిర్వహణ కు ఈ సహాయాన్ని అందించారు.ఈ సందర్భంగా రాయపర్తి మండల మాజీ జడ్పీటీసీ రంగు కుమార్ గౌడ్, మండల పార్టీ నాయకు లు లేతకుల రంగారెడ్డి, కర్ర రవీందర్ రెడ్డి, వంగళ నర్సయ్య, చిట్యాల వెంకన్న, తోట నర్సింగం, సంకినేని ఎల్లస్వామి, చందు రామ్ తదితరులు ఈ విరాళాన్ని ఉత్సవ కమిటీకి అం దజేశారు.

కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బల్లకారి యాకయ్య, ఉప సర్పంచ్ కంటరి భిక్షపతి, గ్రామ పార్టీ అధ్యక్షులు కడుదుల నర్సింహా, వార్డు సభ్యులు యర కుమారస్వామి, వాడికిలా లక్ష్మయ్య, పార్టీ నాయకులు ఎంగిలి అనిల్, ముస్కు మోహన్ రెడ్డి, తుమ్మలపల్లి రాజు, సాంబరాజు, వాడికేలా మహేందర్, పోరండ్ల భిక్షపతి, కడుదుల సంపత్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక నాయకులు ఈ సందర్భంగా ఎస్‌ఆర్‌ఆర్ ఫౌండేషన్ చేసిన సహాయాన్ని అభినందిస్తూ, గ్రామ అభివృద్ధికి ఇలాంటి సహాయాలు మరింతగా కొనసాగాలని కోరారు.