కెనడాలో ఖలిస్థాన్ అనుకూల నినాదాలు

30-04-2024 12:10:00 AM

‘ఖాల్సా డే ’ సందర్భంగా సిక్కుల నినాదాలు 

న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: కెనడాలోని టోరంటోలో జరిగిన ‘ఖాల్సా డే’లో కొందరు సిక్కులు ఖలిస్థాన్ అనుకూల నినాదాలు చర్చనీయాం శమయ్యాయి. పంజాబ్ ప్రజలు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే పండుగల్లో ‘ఖాల్సా డే’ ప్రధానమైంది. సిక్కు మత స్థాపన రోజు ఏటా అక్కడి ప్రజలు ఖాల్సా పండుగ జరుపుకొంటారు. ఆదివారం కెనడాలోని టోరంటోలో జరిగిన ‘ఖాల్సా డే’కు పీఎం జస్టిన్ ట్రూడో, ప్రతిపక్ష నేత పియరీ పొయిలివ్రే, టోరంటో నగర మేయర్ ఒలివియా చౌ, పంజాబ్‌కు చెందిన న్యూ డెమోక్రసీ పార్టీ నేత, ఎంపీ జగ్మీత్‌సింగ్ హాజరయ్యారు. పీఎం జస్టిన్ ట్రూడ్ వేదికపై మాట్లాడేందుకు సిద్ధమవుతుండగా సభికు లు ఖలిస్థాన్ అనుకూల నినాదాలు చేశారు. సిక్కుల హక్కులు, స్వేచ్ఛను కాపాడేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పీఎం ట్రూడో ప్రకటించారు.