19 July, 2026 | 2:14 AM

ఖాతాదారులకు కెనరా బ్యాంక్ ఆర్థిక భద్రత

19-07-2026 12:00 AM
  1. ప్రీమియం పేరోల్ ఖాతాదారుడి నామినీకి ఆర్థిక సాయం
  2.   46 లక్షల బీమా ప్రయోజనం అందజేత

హైదరాబాద్, జులై 18(విజయక్రాంతి): కెనరా బ్యాంక్ తన ప్రీమియం పేరోల్ ఖాతా తో అనుసంధానించిన బీమా ప్రయోజనాల ద్వారా ఖాతాదారులకు ఆర్థిక భద్రత కల్పించడంలో మరోసారి తన నిబద్ధతను చాటు కుంది. నీలా బాయి ప్రమాదంలో దురదృష్టవశాత్తు మృతి చెందారు. ఆమె కెనరా బ్యాంక్ మొజ్జంజాహి మార్కెట్ శాఖలో ప్రీ మియం పేరోల్ ఖాతాను నిర్వహిస్తున్నారు.

ఆ ఖాతాకు లభించే బీమా సౌకర్యాల ప్రకా రం, ఆమె నామినీ కె.లక్ష్మణ్ నాయక్‌కి రూ.40 లక్షల వ్యక్తిగత ప్రమాద బీమా క్లెయి మ్ మొత్తం అందజేశారు. అదనంగా, టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ కింద ఆరు లక్షల రూపాయలు కూడా అందనున్నాయి. దీంతో మొ త్తం రూ.46 లక్షల ఆర్థిక సహాయం లభించనుంది.

ఈ సందర్భంగా నామినీ, కెనరా బ్యాంక్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. క్లిష్ట పరిస్థితుల్లో ఈ బీమా ప్రయోజ నం తమ కుటుంబానికి ఎంతో ఆర్థిక భరో సా కల్పించిందని, ఇలాంటి విలువ ఆధారిత సేవలను అందిస్తున్న కెనరా బ్యాంక్‌కు ఆయ న ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.