ఘనంగా కిసాన్ దివస్ అభినందన
బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కార్యక్రమ నిర్వహణ
వరంగల్, జులై 18(విజయక్రాంతి) : బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ) ఆధ్వర్యంలో శనివారం కిసాన్ దివస్ అభినందన కార్యక్రమాన్ని వరంగల్ లోని దీపు ఫంక్షన్ హాల్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఓఐ హెడ్ ఆఫీసు జనరల్ మేనేజర్ ముఖే ష్ శర్మ ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ వ్యాపార, వ్యవసాయ, గృహ నిర్మా ణ, వాహనాలు, విద్య తదితర రుణాలు త్వరితగతిన అందించేందుకు బీఓఐ నిరంతరం కృషి చేస్తుందన్నారు.
ముఖ్యంగా రైతుల సంక్షేమం, అభివృద్ధి, సుస్థిర వ్యవసాయం దిశగా బ్యాంక్ ఆఫ్ ఇండియా చేస్తున్న కృషి తెలియజేసేందుకు ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. రైతుల అభివృద్ధే దేశ అభివృ ద్ధిగా భావిస్తున్నామని తెలిపారు. బ్యాంకు పేరు చెప్పి సైబర్ నేరగాళ్లు మీకు ఫోన్ చేసి నా, మెసేజ్ పంపినా ఓటీపీ చెప్పొద్దని సూ చించారు. ఎలాంటి రుణాలకైనా తమ ఖాతాదారులకు, వినియోగదారులకు అందుబా టులో ఉండి సత్వర సేవలు అందించేందుకు కృషి చేస్తామన్నారు.
ప్రభుత్వ రంగ బ్యాంకు ల్లో బ్యాంక్ ఆఫ్ ఇండియాకి 120 సంవత్సరాల ఘన చరిత్ర ఉందని, ఖాతాదారుల స హకారంతో బ్యాంకు మరింత వృద్ధి చెందు తూ దేశాభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషిస్తుందన్నారు. ఈ సందర్భంగా మహిళా సం ఘాలకు చెక్కులను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలంగాణ జోనల్ మేనేజర్ ముఖేష్ కుమార్, డిప్యూటీ జనరల్ మేనేజర్ తుషార్ కాంత్ ఝా, డిప్యూటీ జోనల్ మేనేజర్ కళ్యాణ్ చక్రవర్తి, ఎఫ్బీఓఐఓఏ ప్రెసిడెంట్ గాలేటి నాగేశ్వర్, అల్ ఇండియా ఎస్సి ఎస్టి ఒబీసి అసోసియేషన్ నాయకులు లావుడ్య రాజేందర్, ఉద య్ దారావత్, శశి కాంత్, సీనియర్ బ్రాంచ్ మేనేజర్ బి. రాజేష్, బ్యాంకు మేనేజర్ లు గోపీక్రిష్ణ, భూక్యా తారాచంద్, రాజేష్, ఫీల్ ఆఫీసర్లు, సిబ్బంది, కస్టమర్లు పాల్గొన్నారు.






