15-08-2025 08:35:22 PM
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో శుక్రవారం జడ్.పి.హెచ్.ఎస్ బాలికల పాఠశాలలో కెనరా బ్యాంకు దోమకొండ వారి సహకారం తో నిరుపేదలైన షెడ్యూల్ కులాల విద్యార్థినియుల కు 5,వ తరగతి నుండి 10 వ తరగతి వరకూ ఒక్కో తరగతి నుండి ఒక్కరు చొప్పున 6 మంది విద్యార్థులకు ఆర్థిక సహాయం దోమకొండ ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ చేతుల మీదుగా అందజేసారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శరత్, ఉపాద్యాయులు మరియు పిల్లలు కెనరా బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ ప్రశాంత్ హాజరైనారు.