calender_icon.png 15 August, 2025 | 10:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాల్కంపేట లింగయ్యనగర్‌లో వెల్లాల రామమోహన్ చేత పతాకావిష్కరణ

15-08-2025 08:28:48 PM

సనత్‌నగర్,(విజయక్రాంతి): 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బాల్కంపేట లింగయ్యనగర్ కాలనీలో ఘనంగా జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా BJP నాయకుడు వెల్లాల రామమోహన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకున్నారు. దేశభక్తి గీతాల నడుమ జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం, పిల్లలకు మిఠాయిలు పంపిణీ చేసి వారిలో దేశభక్తి, ఐకమత్య స్ఫూర్తిని నింపాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాలనీ వాసులు, మహిళలు, యువకులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.