చాపకింద నీరులా విస్తరిస్తున్న క్యాన్సర్
ప్రెస్ల్‌క్లబ్ అధ్యక్షుడు ఎస్.విజయ్ కుమార్‌రెడ్డి
పంజాగుట్ట, ఏప్రిల్ 26(విజయక్రాంతి): సమాజంలో క్యాన్సర్ మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తోందని ప్రెస్ల్ క్లబ్ అధ్యక్షుడు ఎస్.విజయ్ కుమార్ రెడ్డి అన్నా రు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ వైద్యులు జర్నలిస్టులతో పాటు వారి కుటుంబ సభ్యుల కోసం స్క్రీనింగ్ క్యాంప్ ఆదివారం నిర్వహించారు.
ఓరల్ స్క్రీనింగ్, చెస్ట్ ఎక్స్ రే, మహిళల కోసం పాప్ స్మియర్, మామోగ్రపీ, అల్ట్రాసౌండ్ వంటి పరీక్షలను చేశారు. ఉచిత డాక్టర్ కన్సల్టేషన్ అందించడంతోపాటు క్యాన్సర్ పై అవగాహన కల్పించారు. సుమారు 150 మంది జర్నలిస్టులు క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు చేయించుకున్నారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జీవనశైలిలో మార్పులు వస్తున్నాయ న్నారు. మార్పులతో పాటు క్యాన్సర్ వంటి మహహ్మారి కూడా వస్తోందని పేర్కొన్నారు.
దాన్ని ప్రాథమిక దశలోనే గుర్తిస్తే వీలైనంత త్వరగా తగ్గించుకునే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. అందుకే జర్నలిస్టుల సంక్షేమాన్ని ఆకాంక్షిస్తూ బసవతారకం హాస్పిటల్ సహకారంతో స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహించామని వెల్లడించారు. హాస్పిటల్ వైద్యులకు ధన్యవాదాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ జనరల్ సెక్రటరీ వరికుప్పల రమేశ్, ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.






