calender_icon.png 12 December, 2025 | 3:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభ్యర్థుల జోరు

12-12-2025 01:56:58 AM

  1. అన్ని పార్టీలు బలపరిచిన అభ్యర్థులు ముమ్మర  ప్రచారం
  2. నేటితో ముగియనున్న రెండో విడత ఎన్నికల ప్రచారం.              
  3. ఓ పక్క ఓట్లు, మరోపక్క నాట్లతో గ్రామాలలో బిజీ, బిజీ. 
  4. ఎన్నికలకు ఏర్పాట్లను ఇప్పటికే పూర్తిచేసిన అధికారులు     

మోతె, డిసెంబర్ 11 : గ్రామపంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పల్లెల్లో రాజకీయ వేడి నెలకొంది. అన్ని పార్టీల అభ్యర్థులు కూడా ప్రచారం ముమ్మరంగా చేస్తున్నారు. రెండో విడత ఎన్నికలకు నేటి సాయంత్రం ఐదు గంటలకు ప్రచారం ముగిస్తున్న సందర్భంగా ప్రచారం జోరుగా సాగుతోంది. మండలంలో 

  1. మొత్తం ఓటర్ల సంఖ్య: 37823
  2. పురుషుల సంఖ్య: 18731
  3. స్త్రీల సంఖ్య: 19087
  4. ఇతరులు: 5

తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు దీనికి సంబంధించి అధికారులు కూడా నిరంతర పర్యవేక్షణ చేస్తూ ఎన్నికలు సజావుగా జరగడానికి కావలసిన అన్ని ఏర్పాట్లని ఇప్పటికే దాదాపుగా పూర్తి చేశారు. మండల వ్యాప్తంగా 29 గ్రామపంచాయతీలో ఏడు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా 22 గ్రామాలకి ఎన్నికలు జరగనున్నాయి. దీనితో అభ్యర్థులు ప్రచారం భారీ ఎత్తున చేస్తున్నారు గ్రామాలలో వ్యవసాయ పనులు ఉన్నప్పటికీ కూడా ప్రచారం ఉదయం, సాయంత్రం వేళలో నిర్వహిస్తూ మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు వ్యవసాయ పనులు చేసుకుంటున్నారు. 

పెరగనున్న ఖర్చు : ఓటుకు వందల స్థాయి నుంచి వేల సాయికి దాటిపోతుంది. అనధికారికంగా అభ్యర్థి యొక్క ఖర్చు రూ.25 లక్షల నుంచి 30 లక్షలు ఒక్కొక్క అభ్యర్థికి ఖర్చు కానుంది, దీనితో గెలిచిన వారు రికవరీ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఓడిపోయిన అభ్యర్థులు మాత్రం కుటుంబ సభ్యులతో కలిసి ఏడుపు ఒకటే శరణ్యం కానుంది. కానీ వందకు 500 వందలకు ఆశపడ్డ ఓటర్లు మాత్రం ఓటర్లకు ఐదు సంవత్సరాలు కష్టాలు తప్పని పరిస్థితి ఉంటుంది.

ఈ విషయాన్ని ఓటర్లు అర్థం చేసుకొని మంచి మనసున్న వ్యక్తిని, గ్రామ అభివృద్ధి పై ఏకాగ్రత నిలిపేటటువంటి వ్యక్తిని, ఎన్నుకుంటే ఐదేళ్లు గ్రామంలో ఏ ఇబ్బంది లేకుండా సజావుగా పాలన కొనసాగుతుందని, మేధావులు, విద్యావంతులు కోరుకుంటున్నారు.

మండలంలో 199 వార్డులు..

29 గ్రామపంచాయతీలో 199 వార్డులో అభ్యర్థులు పోటీ చేయగా రెండో విడత 14 వ తారీఖున ఎలక్షన్లు జరగనున్నాయి. మండలంలో దీనికి అధికారులు కూడా 214 పోలింగ్ కేంద్రాలను, 503 మంది సిబ్బందిని ఏర్పాటు చేశారు. అన్ని ఏర్పాట్లు దాదాపుగా పూర్తికావచ్చినాయి. నేటితో ఐదు గంటల వరకు ప్రచారం ముగియనున్నది. దీనితో ఎవరికివారు తనను బలపరిచిన పార్టీ జెండాలను పట్టుకొని ఊర్లో ఇంటింటికి తిరుగుతూ ప్రచారాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఎవరికి  వారు గెలిచేందుకు బాటలు వేస్తున్నారు.

మండలంలో ఏకగ్రీవమైన గ్రామాలు ఇవే..

మండలంలోని మొత్తం 29 గ్రామపంచాయతీలో ఏడు గ్రామాలు 1)మామిల్లగూడెం _ కొరివి నాగమణి వీరస్వామి, 2)విభలాపురం_ గుండ్ల చంద్రకళ, 3) రాయికుంటతండా_ భూక్య ఉప్పయ్య, 4) లాల్ తండా_ బానోతు అండాలు మోహన్, 5) రాంపురం తండా _ బానోతు సత్యమ్మ శీను, 6) భళ్ళు తండ _ భూక్య మల్సూర్,  7) గోల్ తండా _ ధరావత్ భారతి లక్ పతి.